దేశంలో కొన్ని రోజులుగా కరోనా కొత్త రూపం ఒమిక్రాన్ వేరియంట్ అనూహ్య రీతిలో విజృంభిస్తుంది. ఈ నెల మొదటి వారంలో పదుల సంఖ్యలో ఉన్న కేసులు ఇప్పుడు వందలు దాటాయి. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 600 దాటింది. ఈ కేసులు ఎక్కువగా ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణలో ఉన్నాయి. ఈ విషయంలో కేంద్రం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. ఎన్నడూ లేని విధంగా సోమవారం ఒక్కరోజే ఢిల్లీలో 331 కేసులు వెలుగు చూశాయి. దీంతో ఉన్నతాధికారులతో కార్యాచరణపై సీఎం సమీక్ష నిర్వహించారు. అప్రమత్తమైన ఆమ్ ఆద్మీ సర్కార్.. దేశ రాజధానిలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇది చదవండి : సినిమా తీయడానికి డబ్బులు ఇచ్చారా.. టిక్కెట్ ధరలపై మీ పెత్తనం ఏంటీ
కోవిడ్ కేసుల తీవ్రత దృష్ట్యా ఆంక్షలు మరింత కఠినతరం చేస్తున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్..ప్రకటించారు. ఎలాంటి ఆంక్షలు ఉంటాయన్నదానిపై త్వరలోనే పూర్తిస్థాయి ఆదేశాలను జారీ చేయనున్నట్టు తెలిపారు. దేశ రాజధానిలో గత 2 రోజులుగా పాజిటివిటీ రేటు 0.5 శాతంగా నమోదవుతోంది.. ఈ క్రమంలోనే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ లెవల్ 1 అంటే ఎల్లో అలర్ట్ అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చింది ఢిల్లీ సర్కార్.
ప్రస్తుతం ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండగా.. ఢిల్లీలో 50 శాతం ఆక్యుపెన్సీతో మెట్రో, బార్లు. ప్రార్థనా మందిరాల్లో భక్తులకు నో ఎంట్రీ.. సరి-బేసీ పద్ధతిలో మాల్స్‌కు అనుమతి ఉంటుంది. ఇక ఢిల్లీలో కరోనా కేసులు పెరిగితే ఎదుర్కొనేందుకు గతంతో పోలిస్తే మేము 10 రెట్లు ఎక్కువగా సన్నద్ధతతో ఉన్నాం అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆక్సిజన్ వినియోగం, వెంటిలేటర్ల వాడకం పెరగలేదని దానికి ఉదాహరణగా చెప్పుకొచ్చారు కేజ్రీవాల్.