ఫిల్మ్ డెస్క్- వరలక్ష్మి శరత్ కుమార్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తమిళ సూపర్ స్టార్ శరత్ కుమార్ ముద్దురు కూతురైన వరలక్ష్మి చేసింది తక్కువ సినిమాలే అయినా తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వరలక్ష్మి హీరోయిన్ కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఇంకా చెప్పాలంటే లేడీ విలన్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆమె సినిమాలో ఉందంటే ఖచ్చితందా హిట్ అన్న టాక్ తెచ్చుకుంది.
ఈ మధ్య రవితేజ సినిమా క్రాక్ లో జయమ్మగా రఫ్ లుక్ లో కనిపించింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఈ మూవీలో వరలక్ష్మీ నటన అదిరిపోయిందని అన్నారు అంతా. సాధ్యమైనంత వరకు నెగెటివ్ పాత్రలు చేయడానికే వరలక్ష్మి మొగ్గుచూపుతోంది. ఇక క్రాక్ అనంతరం నాంది సినిమాలో ఒక లాయర్ పాత్రలో కనిపించింది వరలక్ష్మి. ఆమె బయట ఎక్కడైనా కనిపిస్తే మాత్రం అభిమానులు జయమ్మ అంటూ విజిల్స్ వేస్తున్నారు.
ఇక నెక్స్ట్ బాలకృష్ణ, గోపిచంద్ మలినేని సినిమాలో కూడా వరలక్ష్మి ఒక ముఖ్యమైన పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇదిగో ఇటువంటి సమయంలో వరలక్ష్మి వర్కౌట్స్ చేసుకుంటున్న వీడియోను పోస్ట్ చేసింది. అందులో జయమ్మ పోట్టి నిక్కరుతో కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ వయసు 36 ఏళ్లు. అయినప్పటికీ ఇంకా 16 ఏళ్ల అమ్మాయిలానే కనిపిస్తోందని ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.