నాయకులైనా, కార్యకర్తలైనా పొగిడినప్పుడు ఎలా ఆనందంగా తీసుకుంటారో.. తిట్టినప్పుడు కూడా అంతే తీసుకోవాలి. ఎక్కడైనా.. ఎప్పుడైనా బాధతోనే, తనకు రావాల్సిన ప్రతిఫలం రాలేదనో ఒక మాట అంటే అగ్గిమీద గుగ్గిలం అవ్వాల్సిన పనిలేదు. అలా ఆవేశం ప్రదర్శించే ఈ లోకల్ లీడర్ ప్రజల ఆగ్రహానికి గురయ్యాడు.
కరీంనగర్ జిల్లా వావిలాలలో తెరాస సభ జరిగింది. తన బాధ నేతలతో వెల్లిబుచ్చుకోవడానికి ఓ దివ్యాంగుడు వచ్చాడు. ఎలాగైనా నేతలకు తన బాధను చేరవేద్దానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పోలీసులు అనుమతించకపోవడంతో అలాగే ఉండిపోయాడు. సభ అయిపోయే వరకు అక్కడే ఎదురుచూశాడు. సభ అయిపోగానే వేదికపైకి వెళ్లి దరఖాస్తు చేసి సంవత్సరం దాటుతున్నా నాకు పింఛను అందడంలేదు అంటూ నినాదాలు చేశాడు.
ఆ దివ్యాంగుడి చర్యతో ఆగ్రహానికి గురైన తెరాస లోకల్ లీడర్ ఒకాయన వెంటనే స్టేజ్ పైకి ఎక్కాడు. ఆగ్రహంతో ఊగిపోతూ ఆ యువకుడి గల్లా పట్టుకున్నాడు. లాగి పక్కకు పడేశాడు. ఆ దృశ్యాలు చూసిన వారంతా ఇదేం పనంటూ ఆగ్రహానికి గురౌతున్నారు. చేతనైతే సాయం చేయాలి. లేదా ఊరుకుండాలి అంటూ హితవు పలికారు.