ఫిల్మ్ డెస్క్- సన్నీ లియోన్.. ఒకప్పుడు ప్రఖ్యాతి గాంచిన ఈ పోర్న్ స్టార్.. ఇప్పుడు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు వసరుసగా సినిమాలు చేస్తోంది. సినిమాల్లోనే కాదు సోషల్ మిడియాలోను సన్నీ యాక్టీవ్ గా ఉంటుంది. సన్నీ లియోన్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంత ఇంత కాదు. హాట్ హాట్ ఫోటోలతో పాటు బోల్డ్ వీడియోలను షేర్ చేస్తూ, కుర్రకారు మతులు పోగోడుతుంది.
సోషల్ మీడియాలో సన్నీలియోన్ ఒక్క ఫోటో షేర్ చేసిన వెంటనే లక్షల లైకులు వచ్చేస్తాయి. సన్నీకి కేవలం బాలీవుడ్ లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. తాజాగా ఈ హాట్ బ్యూటీ షేర్ చేసిన ఓ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సన్నీ వేసింది సింపుల్ స్టెప్స్ అయినా.. ఆమె లుంగీలో చేసిన డ్యాన్స్ అదుర్స్ అంటున్నారు.
ఓ మై ఘోస్ట్ సినిమాతో సన్నీ లియోన్ కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది. ఈ సినిమా కోసం సన్నీ లియోన్ లుంగీ డ్యాన్స్ చేసింది. లుంగీ ధరించి మాస్ బీట్ కు అనుగుణంగా సన్నీ స్టెప్పులేసింది. ఈ డ్యాన్స్ కు సంబంధించి వీడియోను సన్నీ లియోన్ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది.
ప్రస్తుతం సన్నీ లియోన్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సన్నీ అభిమానులు ఆమె లుంగీ డ్యాన్స్ కు ఫిదా అవుతున్నారు. అన్నట్లు సన్నీ లియోన్ ప్రస్తుతం ఓ మై ఘోస్ట్ సినిమాతో పాటు, వీరమాదేవి, రంగీలా, షెరో, కోకకోలా, హెలెన్ తదితర చిత్రాల్లో నటిస్తోంది. అంతే కాదు రెండు వెబ్ సిరీస్ లలో కూడా సన్నీ లియోన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.