సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువైపోయిన ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్ళ ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. వీరి దెబ్బకి సామాన్యులే కాదు, సెలబ్రెటీలు సైతం తలలు పట్టుకోవాల్సి వస్తోంది. తాజాగా.. ఇలాంటి కిలాడీలు చేసిన పనికి స్టార్ యాంకర్, నటి గాయత్రి భార్గవి పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. గుర్తు తెలియని దుండగులు తన ఫేస్‌బుక్ పేజీని హ్యాక్ చేసి.., వివిధ మతాలకు సంబంధించి అభ్యంతకరమైన పోస్టులు చేస్తున్నారంటూ ఆమె పోలీసులకి ఫిర్యాదు చేసింది.
తాజాగా ఈ అంశంపై ఏసీపీ కె. వి. ఎం. ప్రసాద్ సైతం స్పందించారు. యాంకర్ భార్గవి ఎఫ్‌బీ అఫీషియల్ అకౌంట్‌తో పాటు మరో అకౌంట్‌ను దుండగులు ఆమె పేరు మీద క్రియేట్ చేసినట్లు గుర్తించామన్నారు. సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాలని, ఎప్పకప్పుడు పాస్ వర్డ్స్‌ను మార్చుకోవాలని సూచించారు. ఇక ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. చూశారు కదా? సెలబ్రెటీలకే సైబర్ నేరగాళ్ల నుండి ఇబ్బందులు తప్పడం లేదు. సో.., సోషల్ మీడియా సైట్స్ ని వాడే సమయంలో తస్మాత్ జాగ్రత్త.