అనసూయ గత కొన్ని రోజులుగా ఆన్ లైన్ అబ్యూజర్స్ పై పోరాటం చేస్తోన్న సంగతి తెలిసిందే. ట్విట్టర్ వేదికగా కొంతమంది నెటిజన్లు అనసూయని టర్గెట్ చేస్తూ వచ్చారు. ఆంటీ అని సంబోధిస్తూ.. బూతులతో అబ్యూజ్ చేస్తూ వచ్చారు. వీరిపై సైబర్ క్రైమ్ పోలీసులకి అనసూయ ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆమెపై వేధింపులు ఆగలేదు. ఎక్కడో ఇంట్లో కూర్చుని అనసూయ వ్యక్తిగత జీవితంపై అభ్యంతరకర కామెంట్లు వచ్చాడు ఒక యువకుడు. అతనిపై ఈ నెల 17న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు ఆ యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్నాళ్లు అనసూయని వేధించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కి చెందిన యువకుడిగా హైదరాబాద్ పోలీసులు గుర్తించారు.
కోనసీమ జిల్లా పసలపూడి గ్రామానికి చెందిన పండరి రామ వెంకట వీర్రాజు అనే ప్రైవేట్ ఉద్యోగి.. అనసూయపై ట్విట్టర్ వేదికగా బూతు కామెంట్లు చేస్తూ వచ్చాడు. అనసూయ ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా.. అనసూయని వేధించిన యువకుడు పండరి రామ వెంకట వీర్రాజు అని తేలింది. ఇన్ని రోజులూ మొబైల్ ఫోన్లు మారుస్తూ.. పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. వారం రోజుల పాటు కోనసీమలో మకాం వేసి మరీ ఆ యువకుడ్ని పట్టుకున్నారు. యువకుడిపై 354 (ఏ)(డీ), 559 ఐపీసీ సెక్షన్ 67 67(ఏ) ఐటీ యాక్ట్ 2000, 2018 కింద కేసు ఫైల్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.
ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వేదికగా పలువురు సినీ నటులు, యాంకర్ల ఫోటోలు మార్ఫింగ్ చేసి.. అసభ్యకరమైన రాతలు పోస్టులు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. “సాయి రవి 267” అనే ట్విట్టర్ ఖాతా ద్వారా హీరోయిన్లు, యాంకర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టుల ఫోటోలు మార్ఫింగ్ చేసి నగ్న ఫోటోలను పోస్ట్ చేసేవాడు. అనసూయ, రష్మీ గౌతమ్, విష్ణు ప్రియ, ప్రగతి, జయవాణి వంటి సెలబ్రిటీల ఫోటోలను కూడా మార్ఫింగ్ చేస్తూ వచ్చాడు. ఎట్టకేలకు పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గతంలో దుబాయ్ లో ప్లంబర్ గా వర్క్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
కొంతకాలంగా యాక్టర్ అనసూయని సోషల్ మీడియాలో వేధిస్తున్న వ్యక్తి అరెస్ట్#AnasuyaBharadwaj #VishnuPriya #Trolls #Harassment #NTVNews #NTVTelugu pic.twitter.com/y7iEraldZ5
— NTV Telugu (@NtvTeluguLive) November 26, 2022