సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక మానవ జీవన విధానంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ఈ మధ్యకాలంలో వేడుకలన్ని ఇంట్లోకంటే సోషల్ మీడియాలోనే గ్రాండ్ గా జరుగుతున్నాయి. బర్త్ డే విషెస్ మొదలుకొని ఎంగజ్మెంట్స్ – పెళ్లిళ్లు – అప్పగింతలు అన్నీకూడా నెట్టింట పోస్ట్ చేసి హల్చల్ చేయడం చూస్తున్నాం. ఇలాంటి వెరైటీలు ప్రతిరోజూ ప్రపంచంలో ఎక్కడో మూలా జరుగుతూనే ఉన్నాయి. మనం ఇంతవరకు డిఫరెంట్ యాసల్లో పెళ్లి పత్రికలను ప్రింట్ వేయించడం చూస్తూ వచ్చాము. అవి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కూడా చూస్తూనే ఉన్నాం.
ఇక జనాలు ఎంత వెరైటీగా ఆలోచిస్తారో.. ఇప్పుడున్న ట్రెండ్ పట్ల వారి ఐడియాలజీ చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపడాల్సిందే. తాజాగా తన పెళ్లి పత్రికపై మేటర్ ఎలా ఉండాలో కొత్తగా డిజైన్ చేసి సోషల్ మీడియా ట్రెండ్ సృష్టించాడు ముంబైకి చెందిన ఓ డాక్టర్. ఇంతవరకు ఎవ్వరూ ప్రయత్నం చేయని విధంగా తన పెళ్లి పత్రికను వెరైటీగా తయారుచేయించి ఇన్వైట్ చేసాడు. మరి అంతలా వైరల్ అవుతున్న ఆ వెడ్డింగ్ కార్డు సంగతేంటో చూద్దాం!
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా వజీరాబాద్‌కి చెందిన డాక్టర్ సందేశ్.. డిసెంబర్ 7న డాక్టర్ దివ్యను పెళ్లాడనున్నాడు. ఈ సందర్బంగా బంధుమిత్రులను ఆహ్వానించేందుకు తన వెడ్డింగ్ కార్డును స్టాక్ మార్కెట్ యాసలో అచ్చు వేయించాడు. వెడ్డింగ్ కార్డును ఐపీఓ(ఇన్షియల్ పబ్లిక ఆఫర్) తెలిపి.. వధూవరులు అనే రెండు కంపెనీలు కలవాలని నిర్ణయించినందున మ్యారేజ్ జరుగుతోంది. అంతే చమత్కారంగా పెళ్లిపందిరిని స్టాక్ ఎక్స్చేంజిగా.. వచ్చే బంధుమిత్రులను ఇన్వెస్టర్స్ గా నిర్ణయించాడు డాక్టర్ సందేశ్. ఈ పెళ్లి పత్రికలో తల్లిదండ్రులు ప్రమోటర్లు కాగా.. పెళ్లి – రిసిప్షన్ తేదీలను బిడ్డింగ్ డేట్స్ అని. సంగీత్ ను రింగింగ్ బెల్ అంటూ ఫన్నీ వేలో చెప్పుకొచ్చాడు ఈ కొత్త పెళ్ళికొడుకు. మొత్తానికి ఈ వెడ్డింగ్ కార్డు నెట్టింట్లోకి ఎలా వచ్చిందో గాని వైరల్ అవుతూ వీక్షకులను ఆకట్టుకుంటుంది. మీరు ఈ వెడ్డింగ్ కార్డు పై ఓ లుక్కేసి మీ ఒపీనియన్స్ కామెంట్స్ ద్వారా తెలియజేయవచ్చు.