ఒకప్పుడు ఎఫ్ఎం రేడియో వినగానే ఎంతో సందడి వాతావరణం కనిపించేది.. మాటల గారడీతో రేడియో జాకీలు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. అయితే ఈ మద్య ఎఫ్ఎం రేడియో ఛానల్స్‌లో అసభ్యకరమైన, అభ్యంతరకరమైన కంటెంట్ చాలా తరచుగా ప్రసారం అవుతుందని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చిన కారణంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచాచం. కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఎఫ్ఎం రేడియో ఛానల్స్ దూకుడుకు కేంద్రం కల్లెం వేసే ప్రయత్నం చేసింది. రేడియో ద్వారా అసభ్యకర, అభ్యంతకరమైన కంటెంట్‌ను ప్రసారం చేయకూడదని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సూచించింది.
ఒక వేళ అసభ్యకరమైన కంటెంట్‌ను ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అలాంటి వాటిని ప్రసారం చేయడం గ్రాంట్ ఆఫ్ పర్మిషన్ అగ్రిమెంట్ నిబంధనల ఉల్లంఘన కిందకి వస్తుందని సూచించింది. ‘చాలా మంది రేడియో జాకీలు ఉపయోగించే భాష అసభ్యకరమైనదిగా, ద్వంద్వ అర్థాలు వచ్చేలా అభ్యంతకరంగా ఉంటుందని గమనించాం. పైగా అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటివి మంచివి కావు ’అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రతి ఎఫ్ఎమ్ ఛానెల్ కచ్చితంగా నిబంధనలు పాటించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.రేడియో ఛానల్స్‌లో ప్రసారం చేయబడిన కంటెంట్, సందేశాలు, ప్రకటనలు, కమ్యూనికేషన్ అభ్యంతరకరంగా, అసభ్యకరంగా, అనధికారికంగా లేదా భారత చట్టాలకు విరుద్ధంగా ఉండకూడదు. ఇకపై నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.