బెంగళూరు- ఈ మధ్య కాలంలో నేరాలు, ఘోరాలు బాగా పెరిగిపోయాయి. అందులోను సైబర్ నేరగాళ్లు మరింత పేట్రేగిపోతున్నారు. ప్రేమికులకు సంబందించిన రహస్య వీడియోలు తీసి, వారిని బ్లాక్ మెయిల్ చేయడం చూస్తున్నాం. మరికొందరైతే ఇద్దరు వ్యక్తులకు సంబందించి ఏకాంత దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దుర్మార్గానికి పాల్పడుతున్నారు.
కర్టాటక రాష్ట్రంలో ఇలాంటి ఘటనే జరిగింది. హోటల్‌లో స్నేహితురాలితో ఏకాంతంగా గడిపిన వీడియో యూట్యూబ్ లో ప్రత్యక్షమవడంతో ఓ యువకుడు షాక్ తిన్నాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బెంగళూరు ఆస్టిన్ టౌన్ కు చెందిన యువకుడు కొన్నిరోజుల క్రితం హోటల్ లో స్నేహితురాలితో ఏకాంతంగా గడిపాడు.
ఈ క్రమంలో వారు ఏకాంతంగా గడిపిన క్షణాలను హోటల్ లో కొంత మంది దుర్మార్గులు రికార్డ్ చేశారు. వాటిని అతనికి తెలియకుండా వివిధ ఆశ్లీల వెబ్ సైట్ లు, యూట్యూబ్ లో అప్‌లోడ్ చేశారు. గత నెల 21 తేదీన ఇంటర్నెట్‌లో ఈ వీడియో కనిపించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటర్నెట్ చూస్తుండగా స్నేహితురాలితో గడిపిన వీడియో ఆశ్లీల వెబ్ సైట్‌లో కనిపించింది.
దీంతో ఆ యువకుడు సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేసి ఆ వీడియోలను తొలగించాలని కోరాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముందుగా హోటల్ సిబ్బందిని ప్రశ్నించారు. తదుపరి విచారణ చేపట్టారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు.