సాధారణంగా మనం చూసే పక్షులు ఎన్నో రకాల రూపాల్లో ఉంటాయి. కొన్ని అందంగా ఉంటే మరికొన్ని అందవిహీనంగా ఉండే పక్షులూ ఉంటాయి. అయితే పక్షల అరుపులు కొన్ని కోలాహలంగా ఉంటే మరికొన్ని కర్ణ కఠోరంగా ఉంటాయి. కొన్ని పక్షల అరుపులు వింటే సంగీతం విన్నట్లే ఉంటుందని అంటుంటారు. అయితే పక్షలు తమ అరుపుతోనే సంకేతాలు పంపిస్తుంటాయి.
తాజాగా ఓ పక్షి అరుపు వింటే ఇలా కూడా ఉంటుందా అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం తరోంగ జూలో ఉన్న ఒక పక్షి అరుపు పాప ఏడుపును పోలి ఉండడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. మొదట ఈ విషయాన్ని అందరూ కొట్టి పడేసినా.. తర్వాత ఆ పక్షి అరుపు పదే పదే వింటుంటే చిన్న పాప ఏడుస్తున్నట్టుగా వినిస్తుంది. పాల కోసం చిన్న పిల్లాడు గుక్కపట్టినట్టు ఏడుస్తున్న దాని అరుపు చూస్తుంటే ఆశ్చర్యం వేయక మానదు. మొదట జూ సిబ్బంది ఈ పక్షి అరుపు విని జూలో ఎవరైనా తల్లిదండ్రులు తమ చిన్నారిని వదిలి వెళ్లారా అని అంతా కలియతిరిగి అరుస్తున్నది చిన్నారి కాదు పక్షి అని షాక్ తిన్నారట.
పక్షి ఇలా అరవడాన్ని గమనించిన జూ సిబ్బంది, ఆ వీడియోని సోషల్ మీడియాలో ఉంచారు. ఈ వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది. ఈ ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో వింతలు ఉన్నాయి. వాటిల్లో ఇదీ ఒకటి. అయితే రామచికలుకలు మరికొన్ని పక్షులు మనుషుల వాయిస్ ని అనుకరిస్తాయని తెలిసు.. కానీ ఈ పక్షి అరుపు మాత్రం వాటికి భిన్నంగా ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
Bet you weren’t expecting this wake-up call! You’re not hearing things, our resident lyrebird Echo has the AMAZING ability to replicate a variety of calls – including a baby’s cry!
📽️ via keeper Sam #forthewild #tarongatv #animalantics pic.twitter.com/RyU4XpABos
— Taronga Zoo (@tarongazoo) August 30, 2021