బార్ట్ హ్యూజ్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆయన చేసిన పని ఇప్పటికీ ఓ భయంకరమైన పనిగానే మిగిలిపోయింది. ఆయన చేయటానికి ఎవ్వరూ సాహసించటం లేదు.
మత్తు కోసం మందు, గంజాయి, డ్రగ్స్ తీసుకునేవాళ్లను మీరు చూసుంటారు. కొంచెం కాస్ట్‌లీ.. డేంజర్ అయినా సరే అనుకునే వాళ్లు ఏకంగా పాములతో నాలుకలపై కరిపించుకోవటం చేస్తూ ఉంటారు. వీధుల్లో తిరిగే వారు వైట్‌నర్, దగ్గు మందులతో మత్తులో జోగుతూ ఉంటారు. ఈ సమాజంలో వీరందరూ ఒక ఎత్తయితే.. మత్తు కోసం ఇంతవరకు ఎవ్వరూ చేయని పని చేసిన వ్యక్తి ఒకాయన ఉండేవాడు. ఆయన మన ఒళ్లు గగుర్పొడిచే పని చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆయనే నెథర్‌లాండ్‌కు చెందిన బార్ట్ హ్యూజ్. ఆయన చేసిన వింత, విచిత్ర, ఒళ్లు గగుర్పొడిచే విషయం ఇప్పటికీ ఓ ట్రెండ్ సెట్టర్‌గా మిగిలిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. హూగో బార్ట్ హ్యూజ్ 1934లో నెథర్‌లాండ్లో పుట్టాడు. యూనివర్శిటీ ఆఫ్ ఆంస్టర్‌డ్యామ్‌లో వైద్య విద్యను అభ్యసించాడు.
చిన్న వయసునుంచే బార్ట్ మత్తుకు బానిసయ్యాడు. అతడికి ఏం తీసుకున్నా పెద్దగా మత్తు ఎక్కేది కాదు.. ఎక్కినా అది ఎక్కువ సేపు ఉండేది కాదు. దీంతో ఎక్కువ సేపు మత్తులో ఉండటానికి ఓ భయంకరమైన పురాతన పద్దతిని ఎంచుకున్నాడు. 1965లో తన తలలోకి చేత్తో తయారు చేసిన డ్రిల్లింగ్ మిషిన్‌తో రంధ్రం పెట్టుకున్నాడు. ఆ పద్దతి గురించి ఓ బుక్కు రాసి పబ్లిష్ చేశాడు. ‘‘ ట్రెపనేషన్: ఓ క్యూర్ ఫర్ సైకోసిస్’’ అని దానికి పేరు పెట్టాడు. ఈ డ్రిల్లింగ్ పద్దతి గురించి ఆయన మాట్లాడుతూ.. ‘‘ నేను నా పుర్రెకు రంధ్రం చేసుకున్నపుడు నా దగ్గర పెద్దగా డబ్బులు లేవు. అందుకే, ఎలిక్ట్రిక్ డ్రిల్ కాకుండా.. సాధారణ డ్రిల్ వాడాను.
అది చాలా దారుణంగా ఉండింది. నా పుర్రెలోంచి ఓ వైన్ బాటిల్‌ను బయటకు తీస్తున్నట్లుగా అనిపించింది. ఆ బాధనుంచి బయట పడటానికి యాసిడ్‌ను వాడే వాడ్ని. కానీ, అది వర్కవుట్ కాలేదు. తర్వాత రెండో సారి పుర్రెకు రంధ్రం చేసినపుడు వింత సౌండ్లు వచ్చాయి. కొద్దిగా మాత్రమే రంధ్రం చేసుకోగలిగాను. ఆ రంధ్రం నాకు సరిపోలేదు. 1970లో మూడో ప్రయత్నం చేశాను. దాదాపు అరగంట పట్టింది రంధ్రం చేసుకోవటానికి. నా ప్రయత్నం ఫలించింది. నా శరీరం మొత్తం తేలికగా మారింది’’ అని చెప్పుకొచ్చాడు. కాగా, బార్ట్ 2004లో గుండెపోటు కారణంగా చనిపోయాడు. మరి, బార్ట్ వింత పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.