తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాందించాలనేది ప్రతి ఒక్కరి కల. అయితే చాలా మంది లక్షలు సంపాదించడానికే ఏళ్లకు ఏళ్లు కష్టపడుతుంటారు. కానీ కొందరు మాత్రం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. అయితే మరికొందరికి వారి కొత్త ఐడియాలతో ఓవర్ నైట్లోనే కోట్లు సంపాదిస్తారు. అచ్చం అలానే తాజాగా ఓ వ్యక్తి కేవలం 32 నిమిషాల్లోనే కోట్టు సంపాదించాడు. మీరు చదివింది నిజమే. అయితే అతడు బ్యాంకుకు కన్నం వేశాడా అనే సందేహం మీకు రావచ్చు. కానీ అతడు రూ. 5 కోట్లను నిజాయితీగా సంపాదించాడు. మరి.. అంత తక్కువ సమయంలో అంత డబ్బు ఎలా సంపాదించాడు అనే కదా మీ సందేహం. ఆ సంగతేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందిన ఆర్టిస్ట్ క్యామ్ రక్కం పేయింటింగ్స్ వేసేవాడు. క్యామ్ ప్రస్తుతం కాలిఫోర్నియాలో నివసిస్తున్నాడు. క్యామ్ కోవిడ్ బారినపడి .. ఆరోగ్యపరంగా , ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాడు. కోవిడ్ నుంచి కోలుకున్న అనంతరం మళ్లీ తన వృత్తిని ప్రారంభించాడు. కోవిడ్ మహమ్మారి వల్ల ఆర్థికంగా చాలా నష్టపోయినా అదే కోవిడ్ వల్ల ఒక్కసారిగా కోటీశ్వరుడు అయ్యాడు. డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టి.. తన ఆర్ట్‌లను డిజిటల్ వేలానికి పెట్టాడు.. ఆ వేలంలో కేవలం 32 నిమిషాల్లో 5 కోట్లకు పైగా అమ్ముడుపోవడంతో నిమిషాల్లో కోటీశ్వరుడైపోయాడు.మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి