కోటలు మేడలు కట్టాలన్నా, కాటికి నలుగురు మోయాలన్నా ప్రతీది డబ్బుతోనే ముడిపడి ఉన్నది. నేటి రోజుల్లో డబ్బులేని జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకుంటేనే భయం వేస్తుంది. కాగా ఓ వ్యక్తి వందల కోట్లు లాటరీలో గెలుచుకుని కుటుంబసభ్యులకు తెలియకుండా సాధారణ జీవితాన్ని గడిపారు.
నేటి రోజుల్లో మనిషిని శాసిస్తున్నది డబ్బు. డబ్బు ఉంటేనే గౌరవ మర్యాదలు, హోదా లభిస్తున్నాయి. డబ్బు సంపాదన కోసం అహర్నిషలు శ్రమిస్తుంటారు. ఎందుకంటే ఆపద సమయంలో ఆదుకునేది డబ్బే. ఇల్లు కట్టుకోవాలన్నా, వ్యాపారం చేయాలన్నా, కుటుంబాన్ని ఏ లోటు లేకుండా పోషించాలన్నా మనీ ఉంటేనే సాధ్యం. డబ్బు మనిషి జీవితాన్ని అంతలా ప్రభావితం చేస్తున్నది. ఈ క్రమంలో ఓ వ్యక్తి లాటరీలో వందల కోట్లు గెలుచుకొని కుటుంబసభ్యులకు తెలియకుండా ఆ విషయాన్ని రహస్యంగా ఉంచాడు. కోట్ల కొద్ది డబ్బు వారి వద్ద ఉన్నప్పటికి సాధారణ జీవితాన్నే గడిపారు. అసలు ఆ వ్యక్తి ఎందుకు లాటరీ గెలిచిన విషయం కుటుంబసభ్యులకు చెప్పలేదు? దానికి గల కారణమేంటి? ఆ వివారాలు ఇప్పుడు చూద్దాం.
లాటరీ టికెట్లు కొని కోట్లు గెలుచుకొని రాత్రికి రాత్రే కోటీశ్వరులైన సందర్భాలు చాలానే ఉన్నాయి. లాటరీ గెలవడంతో ఒక్కసారిగా వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయి. అప్పటి వరకు అనుభవించిన పేదరికం తొలిగిపోతుంది. కానీ అమెరికాలోని ఓ వ్యక్తి పదేళ్ల క్రితం రూ. 424 కోట్లు గెలుచుకున్నాడు. ఆ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియకుండా రహస్యంగా దాచాడు. వారి వద్ద వందల కోట్లు ఉన్నప్పటికి ఆ విషయం తెలియక సాధారణ జీవితాన్ని గడిపారు. డైలీ స్టార్ కథనం ప్రకారం యూఎస్ లోని కాలిఫోర్నియాలో 67 ఏళ్లు ఉన్న ఓ వ్యక్తి లాటరీలో రూ. 424 కోట్లు గెలిచాడు.
ఈ విషయాన్ని భార్యకు గాని, తల్లిదండ్రులకు గాని, తోబుట్టువులకు గాని చెప్పలేదు. వందల కోట్లు ఉన్న ఆ వ్యక్తి ఓ ఇల్లు, కొత్త ట్రక్కును మాత్రమే కొన్నాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించాడు. ఈ విషయాన్ని బయటకు చెప్తే తన చెల్లె, బావ డబ్బుకోసం తన వెంటే ఉండేవారని, చర్చికి విరాళంగా సగం డబ్బు ఇవ్వాలని తెలిపాడు. కాగా ఆ వ్యక్తికి సంతానం కూడా లేరు. తల్లిదండ్రులు కూడా చనిపోయారు. చెల్లి, బావ అంటే ఇష్టం లేని ఆయన తన డబ్బులోంచి తన చెల్లెకు ఒక్కపైసా కూడా ఇవ్వడానికి అంగీకరిస్తలేడు. అతడి వద్ద అంత డబ్బు ఉన్నట్టు తెలియడంతో అందరు షాక్ కు గురయ్యారు.