జూనియర్ యన్టీఆర్.. పాత్ర ఏదైనా, సన్నివేశం ఎలాంటిది అయినా, తన నటనా చాతుర్యంతో ఎమోషన్ ని అద్భుతంగా పండించగల నటుడు. అయితే.., తారక్ టాలెంట్ వెండితెరకి మాత్రమే పరిమితం కాలేదు. తెలుగులో బిగ్ బాస్ షోకి హోస్ట్ గా అద్భుతమైన లాంచింగ్ ఇచ్చింది కూడా ఈ నందమూరి చిన్నోడే. ఈ నేపథ్యంలోనే జూనియర్ యన్టీఆర్ ఇప్పుడు మరోసారి బుల్లితెరపై తళుక్కుమనబోతున్నాడు.
ప్రముఖ ఎంటెర్టైన్ మెంట్ ఛానెల్ లో ప్రసారం కాబోతున్న “ఎవరు మీలో కోటీశ్వరులు” షోకి జూనియర్ యన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. ఇప్పటికే ఈ షోకి సంబంధించిన ప్రోమో కూడా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తాజాగా “ఎవరు మీలో కోటీశ్వరులు” ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ డేట్ కూడా వచ్చేసింది. ఈ ఆగస్టు 15న ఫస్ట్ ఎపిసోడ్ ఆన్ ఎయిర్ కానుందట.
ఇంకా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏమిటంటే.. ఫస్ట్ ఎపిసోడ్ కి గెస్ట్ గా మెగా హీరో రామ్ చరణ్ రాబోతున్నాడట. తారక్-చరణ్ ఇప్పటికే మంచి స్నేహితులు. పైగా.. వీరిద్దరూ కలసి ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో “ఎవరు మీలో కోటీశ్వరులు” ఫస్ట్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఎక్కువ అయ్యింది. మరి.., తారక్ తన హోస్టింగ్ స్కిల్స్ తో ఈ షోని హిట్ చేయగలడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.