స్పెషల్ డెస్క్- బుల్లెట్ బండి.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈపాటే వినిపిస్తోంది. కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, దేశం ఎల్లలు దాటి, ప్రపంచమంతా పాకిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా బుల్లెట్ బండి పాటను ఎంజాయ్ చేస్తున్నారు. బుల్లెట్ బండి పాట అంతకు ముందు కొందరికి మాత్రమే తెలిస్తే, మంచిర్యాలకు చెందిన కొత్త పెళ్లి కూతురు సాయిశ్రియ డ్యాన్స్ చేశాక బాగా పాపులర్ అయ్యింది.
తన జీవితంలకి అడుగుపెట్టిన జీవిత భాగస్వామికి సర్ ప్రైజ్ ఇవ్వాలని సాయిశ్రియ బుల్లెట్ బండి పాటపై డ్యాన్స్ చేసింది. ఆమె ఈ పాటపై చేసిన డ్యాన్స్ కు పెళ్లి కొడుకు మాత్రమే కాదు, పెళ్లికి వచ్చిన బంధువులు, ఆ తరువాత అందరూ ఫిదా అయిపోయారు. ఇంకేముంది బుల్లెట్ బండి పాటకు నర్సు, అమెరికాలో చిన్నారి.. ఇలా ఒకరి తరువాత ఒకరు డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు.
బుల్లెట్ బండి సాంగ్ కు ఎంత మంది డ్యాన్స్ చేసినా కొత్తగానే ఉంటోంది. ఎవరికి వారు కొత్త స్తైల్లో డ్యాన్స్ చేస్తున్నారు. మరి ఈ పాటలో అంతలా భావం ఉంది, అంతకు మించి సంగీతంలో రిధం ఉంది. అందుకే బుల్లెట్ బండి పాటకు ఎంత మంది డ్యాన్స్ చేసినా కొత్తగా, అందంగా కనిపిస్తోంది. అందరికి నచ్చేస్తోంది.
తాజాగా మరో పెళ్లి కూతురు బుల్లెట్ బండి సాంగ్ కు డ్యాన్స్ చేసింది. పెళ్లి రిసెప్షన్ లో నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా.. అంటూ తన్మయత్వంతో ఆడి, పాడింది. సంతోషంతో ఆమె చేసిన డ్యాన్స్ కు పెళ్లి కొడుకు సహా బంధువులంతా ఎంజాయ్ చేశారు. ఈ పెళ్లికూతురు చేసిన డ్యాన్స్ ఇప్పుడు ఫేస్ బుక్ లో దూసుకుపోతోంది. చూడాలి మరి ముందు ముందు ఇంకా ఎంతమంది బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్ చేస్తారో. ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తారో.