అదా శర్మకు తెలుగులో ఇప్పటికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో ఆమె చేసినవి కొన్ని చిత్రాలే అయినా ప్రేక్షకులు మాత్రం ఆమెను తెలుగమ్మాయిగా యాక్సెప్ట్ చేశారు. అదా శర్మకు కర్రసాము, యోగా, నాన్ చక్స్ వంటి వాటిపై పట్టు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా అదా పోస్ట్ చేసిన అలాంటి ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
అదా శర్మ.. ఈ ముద్దుగుమ్మకు తెలుగునాట చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. హిందీ సినిమాలతో కెరీర్ ప్రారంభించినా కూడా తెలుగులో మంచి గుర్తింపు లభించింది. నితిన్ తో కలిసి హార్ట్ ఎటాక్ సినిమాలో నటించి తెలుగు కుర్రాళ్ల గుండెలు పిండేసింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ చిత్రాల్లో ఎన్నో మంచి సినిమాలు చేసి అభిమానులను అలరించింది. అయితే తర్వాత ఆమె కెరీర్ కాస్త మందగించిందనే చెప్పాలి. అప్పటి వరకు లవ్ ట్రాక్ మూవీస్ చేసిన అదా శర్మ ఒక్కసారిగా ట్రాక్ మార్చింది. కమాండో లాంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత కూడా ఆమె ఫిట్ నెస్, మార్షల్ ఆర్ట్స్, కర్రసాము వంటి వాటిపైనే దృష్టి సారించింది.
సాధారణంగా అదా శర్మ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా.. ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటుంది. తన డైలీ యాక్టివిటీస్, షూటింగ్ అప్ డేట్స్, వెకేషన్ వివరాలు అన్నీ ఇలా ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. ఆమెకు ఇన్ స్టాలో 7.1 మిలియన్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అదా శర్మకు యోగా, మార్షల్ ఆర్ట్స్, నాన్ చక్స్ వంటివి మాత్రమే కాకుండా.. కర్రసాములో కూడా ప్రవేశం ఉంది. తాజాగా హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ చాలీసా చదువుతూ కర్ర సాము చేస్తూ వీడియో పోస్ట్ చేసింది. అదా శర్మ పోస్ట్ చేసిన ఈ పోస్ట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నెట్టింట వైరల్ కూడా అవుతోంది. అదా శర్మ పోస్ట్ చేసిన ఈ వీడియోపై మీ అభిప్రాయాలన కామెంట్స్ రూపంలో తెలియజేయండి.