సాధారణంగా మంచి పేరు, హోదా సాధించాలంటే ఎంతో కష్టపడాలి. అంత కష్టపడి కొందరు స్టార్ డమ్ పొందుతారు. అయితే వారు చేసే చిన్న పొరపాటుతో వచ్చిన మంచి పేరు ఒక్కసారిగా పోతుంది. ఒక్కొక్కసారి జైలు పాలవుతారు. అన్ని రంగాల్లో ఇలాంటివి ఘటనలు జరుగుతున్నప్పటికి.. సినీ ఇండస్ట్రీలో కాస్త ఎక్కువని కొందరి అభిప్రాయం. తాజాగా ఓ స్టార్ హీరో.. పబ్ లో తప్పతాగి.. అక్కడ ఉన్న సింగర్ పై లైంగిక దాడి పాల్పడ్డాడు. అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు హీరోను అరెస్టు చేశారు. ఈఘటన అమెరికాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ది ఫ్లాష్, ఫెంటాస్టిక్ బీస్ట్స్, ది క్రైమ్స్ ఆఫ్ గ్రిండెల్వాల్డ్ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ నటుడు ఎజ్రా మిల్లర్. అతని నటనతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. అయితే అమెరికాలోని ‘హిలోలో’ అనే బార్ లో పార్టీకి వెళ్లాడు. అక్కడ మందు తాగుతూ తన తోటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడే యువతి సాంగ్స్ పాడుతుంది. ఇంతలో మిల్లర్ స్టేజిపైకి ఎక్కి ఆ లేడి సింగర్ ను అసభ్యం పదజాలంతో ఇబ్బంది పెట్టాడు. అంతటితో ఆగక ఆ యువతి ఒంటిపై ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తూ లైంగిక దాడికి పాల్పడ్డాడు.ఈ క్రమంలో అడ్డుకోవడానికి వచ్చిన బార్ మేనేజర్ పై దాడి చేశాడు. ఆ యువతితో పాటు అక్కడి వారిని బూతులు తిడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బార్ యాజమాన్యం మిల్లర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిల్లర్ ని అరెస్ట్ చేశారు. ఇలాంటివి ఇకముందు చేయకుండా 500 డాలర్లు జరిమానా విధించారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. వరుస సినిమాలతో హిట్లు అందుకుంటున్న యువహీరో ఇలా చేయడం అతని పొగరుకు నిదర్శనం అని ఈ విషయం తెలిసిన నెటిజన్లు అన్నారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.