ఇది పెళ్లిళ్ల సీజన్. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు తమకు రేంజ్ కు తగ్గట్లు పెళ్లి చేసుకుంటున్నారు. ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తెగ ఆనందపడిపోతున్నారు. ఇక సినిమాల ప్రమోషన్స్ లోనూ ఇదే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక రీసెంట్ గా హీరో విశాల్ పెళ్లి గురించి తెగ మాట్లాడుకున్నారు. నటి అభినయని మ్యారేజ్ చేసుకోనున్నాడని, త్వరలోనే అనౌన్స్ మెంట్ ఉంటుందని కూడా డిస్కషన్ వచ్చింది. ఇప్పుడు వాటి గురించి మర్చిపోయేలోపే మరో షాకింగ్ విషయాన్ని హీరో విశాల్ బయటపెట్టాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అంటే ముందు గుర్తొచ్చేది ప్రభాస్. అదిగో ఇప్పుడు అప్పుడు అంటున్నారు తప్పించి డార్లింగ్ హీరో ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటాడనేది తెలియట్లేదు. ఫ్యాన్స్ కూడా దాని గురించి అడిగి అడిగి అలసిపోయారు. రీసెంట్ గా బాలీవుడ్ భామ కృతిసనన్ తో ప్రభాస్ డేటింగ్ లో ఉన్నాడనే న్యూస్ వైరల్ గా మారింది. అవన్నీ కూడా రూమర్స్ మాత్రమే అని కృతి తేల్చేయడంతో అంతా రిలాక్స్ అయ్యారు. ఇప్పుడు ప్రభాస్ పెళ్లితో తన మ్యారేజ్ ని లింక్ చేస్తూ హీరో విశాల్ కామెంట్స్ చేశాడు.
విశాల్ పోలీస్ కానిస్టేబుల్ గా నటించిన సినిమా ‘లాఠీ’. డిసెంబరు 22న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ కు విశాల్ అటెండ్ అవుతున్నాడు. ఇందులో భాగంగానే ఓ రిపోర్టర్.. ‘మీ పెళ్లెప్పుడు?’ అని అడిగాడు. దీనికి రెస్పాండ్ అయిన విశాల్.. ‘కెరీర్ పరంగా చాలా బాధ్యతలు నాపై ఉన్నాయి. పెళ్లనేది జోక్ కాదు కదా. నాకైతే ఇంకా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన అయితే రాలేదు. అలానే ప్రభాస్ ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటాడో నేను అప్పుడే మ్యారేజ్ చేసుకుంటా’ అని విశాల్ నవ్వుతూ ఆన్సర్ చెప్పాడు. రీసెంట్ గా ‘అన్ స్టాపబుల్ 2’ షోలోనూ శర్వానంద్, అడివి శేష్.. పెళ్లి గురించి క్వశ్చన్ అడగ్గా.. వాళ్లు కూడా ప్రభాస్ పేరు చెప్పి తప్పించుకున్నారు. ఇప్పుడు విశాల్ కూడా అదే చేశాడు. మరి తన పెళ్లిని ప్రభాస్ మ్యారేజ్ తో హీరో విశాల్ లింక్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.