ఇటీవల సినీసెలబ్రిటీలను వరుసపెట్టి ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలు వెంటాడుతున్నాయి. కన్నడ హీరో దిగంత్ సరదగా బీచ్ లో గడపడానికి వెళ్లి ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా కోలీవుడ్ సీనియర్ అగ్రకథనాయకుడు…అభిమానులు ముద్దుగా ‘కెప్టెన్’ అని పిలుచుకునే హీరో DMDKఅధినేత విజయకాంత్ కు కుడి కాళ్లులోని మూడు వేళ్లు తొలగించారు. ఆయనకు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కాలికి సర్జరీ జరిగింది. ఆయన త్వరగా కోలుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ విజయకాంత్ మిత్రులు సూపర్ స్టార్ రజనీకాంత్ , కమల్ హాసన్ ట్వీట్ చేశారు. దీంతో అసలు విజయకాంత్ కు ఏం జరిగింతో అని ఆయన అభిమానలు ఆందోళన పడుతున్నారు. విజయకాంత్ ఆరోగ్యానికి సంబంధించి పలు రకాలైన వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అయితే అసలు వివరాల్లోకి వెళ్తే..
కెప్టెన్ విజయకాంత్ గత కొన్నాళ్లుగా హై షుగర్ తో బాధపడుతున్నారు. ఇటీవల మరోసారి ఆయన కు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. మధుమేహంతో బాధపడుతున్న విజయకాంత్ కుడి కాలి వేళ్లకు రక్తం సరఫరా కావడం లేదని వైద్యలు గుర్తించారు. రక్తం సరఫరా కాని వాటిని ఉంచితే ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయని వైద్యులు అత్యవసరంగా ఆ వేళ్లను తొలగించినట్టు డీఎండీకే ఆఫీస్ కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని పేర్కొంది. మరో రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని, ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను పట్టించుకోవద్దని అభిమానులు, కార్యకర్తలను కోరింది. విషయం తెలిసిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. తన స్నేహితుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నటుల్లో ఒకరైన విజయకాంత్ రాజకీయాల్లో అడుగుపెట్టి 2005లో DMDKని పార్టీ స్థాపించారు. ప్రజల్లో ఆయన పార్టీకి ఆదరణ పెరిగింది. అయితే, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే పేలవ ప్రదర్శన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పార్టీ ప్రాముఖ్యత క్రమంగా తగ్గింది. ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో గత కొంతకాలంగా అటు రాజకీయాల్లో కానీ, ఇటు సినిమాల్లో కానీ ఆయన చురుకైన పాత్ర పోషించడం లేదు.
என் அருமை நண்பர் விஜயகாந்த் அவர்கள் விரைவில் குணமடைந்து பழையபடி கேப்டனாக கர்ஜிக்க வேண்டும் என்று எல்லாம் வல்ல இறைவனை வேண்டுகிறேன்.
— Rajinikanth (@rajinikanth) June 21, 2022