పూరి జగన్నాధ్ తనయుడు యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కలయికలో వస్తున్న చిత్రం ‘రొమాంటిక్’. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా అనిల్ పాదూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఇక విషయం ఏంటంటే..? ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇటీవల వరంగల్ లో నిర్వహించింది. దీనికి యంగ్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్యఅతిధిగా హజరయ్యాడు. అయితే ఈ సందర్భంగా మాట్లాడిన విజయ్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ రోమాంటిక్ ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. ఈ సినిమాకి పూరి జగన్నాధ్, చార్మీలు ఎంత కష్టపడ్డారో ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఈ మూవీ ఖచ్చితంగా హిట్ కోడుతుందని తెలిపారు.
ఇక దీంతో పాటు నేను నటిస్తున్న లైగర్ సినిమాకు కూడా వీళ్లిద్దరే చేస్తున్నారు. లైగర్ సినిమాలోని ఒక్కో విజువల్ చూస్తే అది మీకే అర్థమవుతుంది. మేము ఒక్కటే ఫిక్సయ్యాం. 2022లో లైగర్ తో ఇండియాని షేక్ చేయాలె. ఫిక్స్ అయిపోండి అంటూ విజయ్ దేవరకొండ కామెంట్స్ చేశారు. తాజాగా విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఫిల్మ్ నగర్ లో కాస్త చర్చనీయాంశమవుతోంది. ఇక ‘రొమాంటిక్’ మూవీ అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.