ఎంతోమంది సెలబ్రిటీలు ఈ ఏడాది మరణించారు. అభిమానులని శోకసంద్రంలో ముంచేశారు. టాలీవుడ్ లోనూ 2022లో చాలామంది చనిపోయారు. కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, చలపతిరావు లాంటి ఎంతోమంది యాక్టర్స్ మరణించారు. ఇది ఒక్క తెలుగుకి మాత్రమే ఇతర ఇండస్ట్రీల్లోనూ పలువురు స్టార్ సెలబ్రిటీలు కూడా ఇలానే ఫ్యాన్స్ ని వదలివెళ్లిపోయారు. ఇక ఇప్పుడు కూడా ప్రముఖ నిర్మాత నితిన్ మన్మోహన్ గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో పలువురు సెలబ్రిటీలు ఆయనకు సంతాపం ప్రకటిస్తూ, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన సినిమాల్ని నిర్మించిన నితిన్ మన్మోహన్ ఎంతో పేరు తెచ్చుకున్నారు. డిసెంబరు 3న ఆయనకు గుండెపోటు రాగా ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత కాస్త కుదురుకున్నట్లు కనిపించినప్పటికీ.. గత 15 రోజుల నుంచి మాత్రం వెంటిలేటర్ పైనే ఉన్నారు. ఆరోగ్యం విషమించడంతో ఈ ఉదయాన్నే తుదిశ్వాస విడిచారు. నాన్న మరణం గురించి చెప్పిన ఆయన కుతూరు.. ‘గత మూడు వారాల నుంచి ఆస్పత్రిలో ఉన్న నాన్న.. ఈ రోజు ఉదయమే మరణించారు’ అని చెప్పారు. తండ్రి అనారోగ్యం పాలవడంతో దుబాయిలో జాబ్ చేస్తున్న కొడుకు.. కొన్నిరోజుల ముందే స్వదేశానికి వచ్చేశాడు.
ఇక 1986లో ‘బాత్ బన్ జాయే’ సినిమాతో నిర్మాతగా మారిన నితిన్ మన్మోహన్.. బోల్ రాధా బోల్ (1992), ఆర్మీ (1996), షూల్ (1999), లవ్ కే లియే కుచ్ బీ కరేగా (2001), దస్ (2005), యమ్లా పగ్లా దీవానా (2011), రెడీ (2011) లాంటి మూవీస్ కూడా తీశారు. కొన్ని చిత్రాలకు రైటర్ గానూ పనిచేశారు. ఇక నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న నితిన్ కు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఆయన సోదరుడు హేమంత్ పంచమియా.. ముంబయిలో ప్రముఖ ఎగ్జిబిటర్ గా పేరు తెచ్చుకున్నారు. ఏదేమైనా టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ ఈ ఏడాది చాలా విషాదాలు చోటుచేసుకున్నాయి. ఇలా సీనియర్ నటీనటులు, నిర్మాతలు, దర్శకులు మరణిస్తున్నారు.
Veteran film producer #NitinManmohan passed away earlier this day in Mumbai.
He produced films like Baat Ban Jaaye, Insaaf, Anjali (Hindi dub), Baaghi, Adharm, Bol Radha Bol, Laadla, Army, Shool, Love Ke Liye Kuch Bhi Karega, Deewangi, Bhoot, Dus, Yamla Pagla Deewana & Ready. pic.twitter.com/iJzPgsLim5
— CinemaRare (@CinemaRareIN) December 29, 2022