ఆమె నటిగా చాలా పేరు తెచ్చుకుంది. తాజాగా పెళ్లి కూడా చేసుకుంది. అయితే మ్యారేజ్ లో ఆమె చేసిన ఓ పని, చిక్కుల్లో పడేసింది.
ఆమె పాక్ కు చెందిన ప్రముఖ నటి. 2013 నుంచి ఇండస్ట్రీలో ఉంది. యాక్టింగ్ తో పాటు రైటర్ గానూ పలు సినిమాలు, సీరియల్స్ కు పనిచేసింది. గత కొన్నేళ్ల నుంచి రిలేషన్ లో ఉన్న గోల్ఫ్ ప్లేయర్ ను తాజాగా పెళ్లి చేసుకుంది. చాలా తక్కువమంది మాత్రమే ఈ వేడుకకు హాజరు కాగా.. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో సదరు నటిని ఆ దేశానికి కొందరు దారుణంగా ట్రోల్ చేశారు. ఆమె ఓ తప్పు చేయడమే దీనికి కారణమని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పాక్ కు చెందిన నటి ఉష్నా షా రీసెంట్ గా గోల్ఫ్ ప్లేయర్ హంజా అమీన్ ని పెళ్లి చేసుకుంది. అదే దేశానికి చెందిన బ్రాండ్ వార్దా సలీమ్ రూపొందించిన ఎరుపు రంగు లెహంగాలో కనిపించింది. నవ్వుతూ, డ్యాన్స్ చేస్తూ ఫొటోలకు పోజిలిచ్చింది. అయితే కొందరు ఫొటోగ్రాఫర్లు పర్మిషన్ లేకుండా ఆమె పెళ్లిలో కొన్ని ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో చిక్కులు మొదలయ్యాయి. ఈ లెహంగా పాకిస్థానీ సంప్రదాయం కాదని చాలామంది ఆమెని విమర్శించారు. ఆమె ఇన్ స్టాకు వందల, వేల మెసేజులు పంపించారు. దీంతో ఆ తాకిడిని తట్టుకోలేకపోయిన ఉష్నా షా తన ఇన్ స్టా ఖాతాని క్లోజ్ చేసిపడేసింది.
అంతకు ముందు ఈ ట్రోలింగ్ పై స్పందించిన ఉష్నా షా.. తన స్టోరీలో ఓ పోస్ట్ షేర్ చేసింది. ‘మిసెస్ అమీన్.. నా డ్రస్ సమస్యగా ఫీల్ అవుతున్నవాళ్లకోసమే చెబుతున్నా. నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలో మీరు సూచించాల్సిన అవసరం లేదు. నా డ్రస్సుల కోసం మీరెవరూ డబ్బులు ఖర్చుపెట్టలేదు. నా ఆభరణాలు, దుస్తులు పూర్తిగా పాకిస్థానీ. నా హార్ట్ సగం ఆస్ట్రియన్. దేవుడు మన అందరినీ సంతోషంగా ఉంచాలని ఆశిస్తున్నారు. మా పెళ్లికి వచ్చిన ఆహ్వానం లేని ఫొటోగ్రాఫర్స్ కు నా శుభాకాంక్షలు’ అని ఉష్నా షా ఘాటుగా స్పందించింది. ఇప్పుడు ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఉష్నా పెళ్లి డ్రస్, వివాదం, ఇన్ స్టా డీ యాక్టివేట్ చేయడంపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.
@ushnashah deactivated her account . She wants to spend Quality time with her husband in Australia 😁 #ushnashahwedding #UshnaShah #Ushna pic.twitter.com/R7cxHs1wh6
— NimŔą 🥰 (@Nimihere17) March 1, 2023