Upasana Konidela: నలుగురికి సహాయం చేయటంలో మెగా ఫ్యామిలీకి ఇండస్ట్రీలోనే కాదు.. బయట కూడా ఎంత మంచి పేరుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీలోని చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్‌చరణ్‌లు ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడూ ముందుంటారు. ఇప్పుడు, మెగా కోడలు ఉపాసన కూడా తన సేవా కార్యక్రమాలతో ఆ కుటుంబానికి తగ్గ కోడలు అనిపించుకుంటోంది. ఒక వైపు యజమానిగా అపోలో బాధ్యతలతో.. మరో వైపు కోడలిగా మెగా ఇంటి బాధ్యతలతో ఎప్పుడూ బిజీగా ఉంటారామె. ఎంత బిజీగా ఉన్నా సేవా కార్యక్రమాల విషయంలో వెనక్కు తగ్గటం లేదు. వీలు దొరికినప్పుడల్లా ఎవరో ఒకరికి సహాయం చేస్తూనే ఉన్నారు.
ఆమె మంచి మనసుకు సంబంధించిన ఓ విషయం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉపాసన 150 వృద్ధాశ్రమాలకు ఆర్థిక సాయం చేస్తున్నారంట. బిలియన్ హార్ట్స్ బీటింగ్ అనే ఫౌండేషన్‌తో కలిసి దేశ వ్యాప్తంగా ఉన్న 150 వృద్ధాశ్రమాలకు సహాయం చేస్తున్నారట. ఉపాసన కొంతమంది వృద్ధురాళ్లతో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోల వెనుక కథ తెలుసుకుంటున్న నెటిజన్లు.. ఉపాసన గొప్ప మనసుకు హ్యాట్సాప్ చెబుతున్నారు. మరి, ఉపాసన మంచి మనసుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#UpasanaKonidela, the wife of actor @AlwaysRamCharan, supports over 150 old age homes through the Billion Hearts Beating Foundation across India. ❤️
She’s always known for her good heart and charity.. Great going @upasanakonidela 👏👏#Ramcharan pic.twitter.com/JHTnmcDh4r
— VamsiShekar ON DUTY (@UrsVamsiShekar) May 2, 2022
ఇవి కూడా చదవండి : “నేను విన్నాను, నేను ఉన్నాను”! మహేష్ బాబు నోట జగన్ మాట!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.