మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులకు ఆడబిడ్డ పుట్టడంతో మెగా - అల్లు ఫ్యామిలీస్‌తో పాటు రిలేటివ్స్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. పెళ్లైన 11 ఏళ్ల తర్వాత చరణ్ తండ్రి కావడంతో తమ కొణిదెల కుటుంబంలోకి మహాలక్ష్మీ వచ్చిందంటూ చిరంజీవి తెగ సంబరపడిపోతున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు ఆడబిడ్డ పుట్టడంతో మెగా – అల్లు ఫ్యామిలీస్‌తో పాటు రిలేటివ్స్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. పెళ్లైన 11 ఏళ్ల తర్వాత చరణ్ తండ్రి కావడంతో తమ కొణిదెల కుటుంబంలోకి మహాలక్ష్మీ వచ్చిందంటూ చిరంజీవి తెగ సంబరపడిపోతున్నారు. కుటుంబ సభ్యులంతా ఆసుపత్రికి వెళ్లి లిటిల్ ప్రిన్సెస్‌ని చూసొచ్చారు కూడా. మెగా ఫ్యామిలీలోకి విచ్చేసిన పాప జాతకం గురించి వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ రోజు (జూన్ 23) ఆసుపత్రి నుండి ఉపాసన, బేబీ డిశ్చార్జి అయ్యారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మీడియాతో మాట్లాడారు. పాప అచ్చు తన నాన్నలానే ఉందని.. పుట్టిన 21వ రోజు తమ గారాల పట్టీకి పేరు పెడతామని, మా అభిమానుల ప్రార్థనలు, పూజల వల్లే ఇదంతా. అభిమానుల నుండి ఇంతకన్నా నేనేమీ కోరగలను. అన్ని దేశాల నుండి ఆశీస్సులు వచ్చాయి, అవి ఎప్పుడూ అలానే ఉంటాయి. అంటూ ఎమోషనల్ అయ్యారు. అయితే చరణ్ మాదిరిగానే తొలి సంతానంగా కుమార్తెకు జన్మనిచ్చిన స్టార్స్ కొందరు లెజెండరీ యాక్టర్లుగా రాణిస్తున్నారు. అలాగే మెగా ప్రిన్సెస్ రాకతో చరణ్ జాతకం మారిపోతుందని, లెజెండ్ కాబోతున్నాడని మెగా ఫ్యాన్స్ సంబర పడుతున్నారు. మొదటి సంతానంగా ఆడపిల్ల కలిగిన స్టార్లు ఎవరో చూద్దాం.
చిరంజీవి – సుస్మిత
చిరంజీవి – సురేఖ దంపతుల తొలి సంతానంగా జన్మించిన సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ, నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.
బాలకృష్ణ – బ్రాహ్మణి
బాలకృష్ణ – వసుంధర దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు కాగా.. పెద్ద కుమార్తె బ్రాహ్మణి నారా వారింటికి కోడలిగా వెళ్లింది. హెరిటేజ్ గ్రూప్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారామె.
వెంకటేష్ – ఆశ్రిత
విక్టరీ వెంకటేష్ – నీరజలకు ఫస్ట్ ఆశ్రిత జన్మించారు. ఆమె ఫుడ్ వ్లాగర్. అలాగే ఇన్ఫినిటీ ఫ్లాటర్ పేరుతో సోషల్ మీడియా హ్యాండిల్స్ మెయింటెన్ చేస్తున్నారు.
మోహన్ బాబు – లక్ష్మీ ప్రసన్న
మోహన్ బాబుకి ముగ్గురు పిల్లలు కాగా మంచు లక్ష్మీ ప్రసన్న తొలి సంతానం. యాక్ట్రెస్, ప్రెజెంటర్ అండ్ ప్రొడ్యూసర్‌గానూ రాణిస్తున్నారామె.
అమితాబ్ బచ్చన్ – శ్వేత బచ్చన్
అమితాబ్ బచ్చన్ – జయ దంపతుల తొలి సంతానంగా శ్వేత జన్మించారు. హోస్ట్, జర్నలిస్ట్, మోడల్‌గా అభిరుచిని చాటుకున్నారామె.
రజినీ కాంత్ – ఐశ్యర్య
రజినీ కాంత్ – లత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ఐశ్యర్య దర్శకురాలిగా పరిచయమే. తమిళంలో సింగర్, డబ్బింగ్ ఆర్టిస్టుగానూ వర్క్ చేశారు.
కమల్ హాసన్ – శృతి హాసన్
కమల్ హాసన్‌కి ఇద్దరు కుమార్తెలు కాగా పెద్దమ్మాయి శృతి నటిగా, మ్యుజిషియన్‌గా సత్తా చాటుతున్నారు.
రాజశేఖర్ – శివాణి
రాజశేఖర్ – జీవితలకు ఇద్దరు కూతుర్లు. పెద్దమ్మాయి శివాణి, రెండో అమ్మాయి శివాత్మిక ఇద్దరూ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
రవితేజ – మోక్షద
రవితేజకు తొలుత పాప పుట్టింది. మోక్షద భూపతిరాజు తన పేరు. తర్వాత బాబు మహాధన్ జన్మించాడు.
వీరితో పాటు జగపతి బాబు, దివంగత నందమూరి తారక రత్న, మంచు విష్ణు, అల్లరి నరేష్, ఆది సాయి కుమార్, అభిషేక్ బచ్చన్, సైఫ్ అలీ ఖాన్, రణ్‌బీర్ కపూర్, అనిల్ కపూర్, షాహిద్ కపూర్ వంటి స్టార్లందరికీ మొదటి సంతానంగా ఆడపిల్లలే పుట్టారు.