దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 25, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్ బాస్టర్ హిట్‌గా రికార్డులను తిరగరాసింది. ఈ సినిమా తాజాగా జపాన్‌లో రిలీజైంది. అక్టోబర్ 21వ తేదీ జపనీస్ థియేటర్లలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మూడు రోజుల ముందే రాజమౌళి, జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ దంపతులు ప్రమోషన్ల కోసం జపాన్‌కు వెళ్లారు. ఇక అప్పటినుంచి ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతున్నారు. వారి జపాన్ పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలోకి వచ్చి వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా, రాజమౌళి, జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ దంపతులకు సంబంధించిన రెండు ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.
ఆ ఫొటోలను రామ్‌చరణ్ భార్య ఉపాసన తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘ ఇది షో టైం’’ అని రాసుకొచ్చారు. ఆ ట్వీట్‌లో.. రాజమౌళి భార్య రమా, ఎన్టీఆర్ భార్య ప్రణతి, రామ్ చరణ్ భార్య ఉపాసన ఒక గ్రూపుగా.. రాజమౌళి, జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒక గ్రూపుగా ఫొటోలు దిగారు. జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ దంపతులు ఆ ఫొటోల్లో జపనీస్ దుస్తుల్లో ఉండటం విశేషం. ఇక, మంగళవారం రాత్రి రామ్ చరణ్, ఉపాసన జపాన్‌లోని ఓ హోటల్‌లో డిన్నర్ చేశారు. రామ్ చరణ్‌ను గుర్తించిన ఫ్యాన్స్ ఆయనతో ఫొటో దిగారు. ఆ ఫొటోను ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్టోరీగా పెట్టుకున్నారు.
అందుకు సంబంధించిన ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారి హల్‌చల్ చేసింది. కాగా, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో రామ్ చరణ్ సరసన ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ నటించారు. అజయ్ దేవ్‌గణ్, శ్రియా శరణ్, సముద్ర ఖని తదితరులు ముఖ్య పాత్రలను షోషించారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే వంద కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇప్పటివరకు దాదాపు 1111 కోట్ల రూపాయల కలెక్షన్లను కొల్లగొట్టింది. ఓటీటీ ప్లాట్ ఫాంలపై కూడా తన సత్తా చాటుతోంది. ఇండియన్ సినిమా స్థాయిని హాలీవుడ్ లెవెల్‌కు తీసుకుపోయింది. ఆస్కార్ బరిలో నిలిచింది. ఇక, హాలీవుడ్ వాళ్ళు సైతం ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆస్కార్ రావాలని కోరుకుంటున్నారు.
It’s show time ! 🎥 #RRRInJapan pic.twitter.com/bcoGZEHcbq
— Upasana Konidela (@upasanakonidela) October 21, 2022