రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిలిం ‘సలార్’ టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. టీజర్లో ప్రభాస్ పాత్రను ఆకాశానికెత్తేస్తూ ఎలివేషన్స్ ఇచ్చిన నటుడు ఎవరబ్బా? అంటూ నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిలిం ‘సలార్’.. KGF తరహాలోనే రెండు భాగాలుగా విడుదల చెయ్యబోతున్నారు. ఫస్ట్ పార్ట్ ‘సలార్ పార్ట్ 1 – సీజ్ ఫైర్’ (Salaar Part 1 – Cease Fire) గురువారం (జూలై 6) ఉదయం రిలీజ్ అయిన టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ప్రభాస్‌ని యాక్షన్ హీరోగా సరికొత్తగా చూపించబోతున్నాడని నీల్ మావ హింట్ ఇచ్చాడు. తన స్టైల్లో హీరో క్యారెక్టర్‌కు ఇచ్చిన ఎలివేషన్స్ ఇచ్చి అదరగొట్టేశాడు. ఇక టీజర్లో ఒక పాత్రకు మాత్రమే డైలాగ్స్ పెట్టారు. ప్రస్తుతం ప్రభాస్ పాత్రను ఆకాశానికెత్తేస్తూ ఎలివేషన్స్ ఇచ్చిన నటుడు ఎవరబ్బా? అంటూ నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. ఆయన ఎవరో కాదు..
సీనియర్ బాలీవుడ్ యాక్టర్ టినూ ఆనంద్. నటనతో పాటు రచన, దర్శకత్వ విభాగాల్లోనూ ప్రతిభ చాటుకున్న టినూ ఆనంద్.. బాలకృష్ణ ‘ఆదిత్య 369’ మూవీలో టైం మిషన్‌ని కనిపెట్టే ప్రొఫెసర్ రామ్ దాస్ అనే సైంటిస్ట్‌గా కనిపించారు. తర్వాత ‘ఘటోత్కచుడు’ లోనూ కనిపించారు. మెగాస్టార్ చిరంజీవి ‘అంజి’ లో ఆత్మ లింగం కోసం ప్రయత్నించే భాటియాగా నటించారు. కొంత గ్యాప్ తర్వాత ప్రభాస్ ‘సాహో’ లో చేశారు. దుల్కర్ సల్మాన్- మృణాల్ ఠాకూర్ల ‘సీతా రామం’ లో ఆనంద్ మెహతాగా అలరించి, ఇప్పుడు ‘సలార్’ టీజర్‌తో వార్తల్లో నిలిచారు. గతంలోనే తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో నటించారు లెజెండరీ యాక్టర్ టినూ ఆనంద్.
ఫ్యామిలీ అంతా సినీ నేపథ్యమే..
టినూ ఆనంద్ తండ్రి ఇందర్ రాజ్ ఆనంద్ హిందీలో డైలాగ్, స్క్రీన్ రైటర్. ఎక్కువ రాజ్ కపూర్ చిత్రాలకు పని చేశారు. ఆయన మామ ఆఘా పాపులర్ యాక్టర్. ఎక్కువగా కామెడీ రోల్స్ చేశారు. ఇక బావ జలాల్ ఆఘా కూడా యాక్టర్ కమ్ డైరెక్టర్. టినూ మేనల్లుడు సిద్దార్థ్ ఆనంద్ అందరికీ పరిచయమే. ‘బ్యాంగ్ బ్యాంగ్’, ‘వార్’, ‘పఠాన్’ లాంటి పలు సూపర్ హట్ మూవీస్ డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు హృతిక్ రోషన్‌తో ‘ఫైటర్’ తీస్తున్నాడు. ప్రభాస్‌తోనూ ఓ సినిమా చెయ్యబోతున్నారని సమాచారం.