సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు కొనసాగుతూ ఉన్నాయి. కరోనా సమయంలో ఎంతోమంది సినీ ప్రముఖులు అకాల మరణం చెందారు. కరోనా తర్వాత కూడా ఈ విషాద ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గురువారం మధ్యాహ్నం నిఖిల్ తండ్రి కావలి శ్యామ్ సిద్దార్థ్ మృతి చెందారు. తండ్రి మృతిపట్ల నిఖిల్, కుటుంబసభ్యులకు టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు- ప్రముఖులు సంతాపం తెలియజేశారు. శ్యామ్ సిధార్థ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. నిఖిల్ సినీ రంగంలో రాణించడానికి తండ్రి శ్యామ్ సిధార్థ కృషి ఎంతో ఉంది. తండ్రితో తనకున్న అనుబంధాన్ని నిఖిల్ చాలాసార్లు మీడియా ముఖంగా పంచుకున్న సందర్భాలు ఉన్నాయి. తనకి అన్ని విధాలా మద్ధతుగా ఉన్న తండ్రి మరణంతో నిఖిల్ కుంగిపోయాడు. మరి హీరో నిఖిల్ తండ్రి శ్యామ్ సిధార్థ అకాల మృతిపట్ల కామెంట్స్ రూపంలో మీ సంతాపాన్ని తెలియజేయండి.