మరో నెల రోజులు పోతే సంక్రాంతి హడావుడి మొదలైపోతుంది. స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తాయి. అంతలో తమ సినిమాలని రిలీజ్ చేసేయాలని నిర్మాతలు తెగ పోటీపడుతున్నారు. అందులో భాగంగానే ఈ వారం ఏకంగా 18 సినిమాలను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. అది కూడా ఈ శుక్రవారమే కావడం విశేషం. కాకపోతే అందులో ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తున్నవి మాత్రం కొన్ని చిత్రాలే. ఇంతకీ అవేంటి? వాటి రిలీజ్ సంగతేంటి ఇప్పుడు చూద్దాం.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఏడాది చివరికొచ్చేశాం. దీంతో ఇప్పటివరకు రిలీజ్ విషయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొన్న సినిమాలన్నీ కూడా థియేటర్లలోకి వచ్చేందుకు క్యూ కడుతున్నాయి. అందులో భాగంగానే డిసెంబరు తొలివారం అంటే 9వ తేదీన(శుక్రవారం) ఏకంగా 18 సినిమాలు బిగ్ స్క్రీన్ పై సందడి చేయనున్నాయి. వీటిలో సత్యదేవ్ ‘గుర్తుందా శీతాకాలం’, బ్రహ్మానందం ‘పంచతంత్రం’, విశ్వక్ సేన్ ‘ముఖచిత్రం’ సినిమాలు మాత్రం కాస్త చెప్పుకోదగ్గవి. అలానే రీ రిలీజ్ లో భాగంగా ఒకప్పటి క్లాసిక్స్ ‘మాయాబజార్’, ‘ప్రేమదేశం’.. ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తుండటం విశేషం.