ఇటీవల కాలంలో ఓటిటి సినిమాలకు ఎంతటి డిమాండ్ పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలతో పాటు ఓటిటి సినిమాలకు కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అందుకే థియేట్రికల్ సినిమాలు కూడా ఓటిటిలోకి ఎప్పుడు వస్తాయా? అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు అన్ని సినిమాలు.. డిఫరెంట్ ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా మరో తెలుగు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అయిపోయింది. విశ్వక్ సేన్, ప్రియా వడ్లమాని, వికాస్ వశిష్ట, చైతన్య రావు కీలకపాత్రలలో నటించిన చిత్రం ‘ముఖచిత్రం’.
గతేడాది డిసెంబర్ 9న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. విడుదలైన 50 రోజుల తర్వాత డిజిటల్ రిలీజ్ కి సిద్ధమైంది. కాన్సెప్ట్ బాగున్నప్పటికీ, ఎక్సిక్యూషన్ లో ఫెయిల్ అయిన ఈ సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను తెలుగు ఓటిటి ‘ఆహా’ దక్కించుకుంది. కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్.. కథా, స్క్రీన్ ప్లే, మాటలు అందించిన ఈ సినిమాని గంగాధర్ తెరకెక్కించాడు. పాకెట్ మనీ బ్యానర్ పై ప్రదీప్ యాదవ్, మోహన్ ఎల్లా సినిమాని నిర్మించారు. ఇక క్రైమ్, కోర్టు డ్రామా జానర్ లో రూపొందిన ఈ సినిమా.. థియేట్రికల్ గా పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇందులో లాయర్ రోల్ ప్లే చేయడం విశేషం.
ఇక ఈ మధ్యకాలంలో థియేట్రికల్ సినిమాలన్నీ విడుదలైన నెల రోజుల్లోనే ఓటిటి రిలీజ్ అయిపోతున్నాయి. అలాంటిది చిన్న సినిమా అయినా రిలీజైన 50 రోజుల తర్వాత ఓటిటిలోకి రాబోతుంది. ఈ సినిమా ఆహాలో ఫిబ్రవరి 3 నుండి స్ట్రీమింగ్ కాబోతుందని అధికారికంగా ప్రకటన బయటికి వచ్చింది. తాజాగా ఓటిటి ప్రీమియర్ కి సంబంధించి కొత్త ట్రైలర్ ని రిలీజ్ చేశారు ఆహా వారు. థియేట్రికల్ గా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయినా కొన్ని సినిమాలు ఓటిటిలను షేక్ చేస్తున్నాయి. మరి ఈ ముఖచిత్రం మూవీ కూడా ఓటిటిలో ఏమైనా బజ్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి. సో.. ఓటిటిలు మిమ్మల్ని ఎలా అలరిస్తున్నాయి? ఓటిటి సినిమాలపై మీ అభిప్రాయాలు ఏంటి? అనేది కామెంట్స్ లో తెలియజేయండి.