ఓటీటీ మాధ్యమాలు ఎన్ని రకాలుగా ఎంటర్‌టైన్ చేస్తున్నా కానీ శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమాలకు కూడా ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు తెలుగు ఆడియన్స్. ఎప్పటికప్పుడు ఈ వారం థియేటర్లలో సందడి చేయబోయే సినిమాలేంటి?.. ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవబోయే మూవీస్, వెబ్ సిరీస్ ఏంటి? అని ఆసక్తిగా ఆరా తీస్తుంటారు.
ఓటీటీ మాధ్యమాలు ఎన్ని రకాలుగా ఎంటర్‌టైన్ చేస్తున్నా కానీ శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమాలకు కూడా ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు తెలుగు ఆడియన్స్. ఎప్పటికప్పుడు ఈ వారం థియేటర్లలో సందడి చేయబోయే సినిమాలేంటి?.. ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవబోయే మూవీస్, వెబ్ సిరీస్ ఏంటి? అని ఆసక్తిగా ఆరా తీస్తుంటారు. ఇక వాటి అప్‌డేట్లతో సోషల్ మీడియా అంతా సందడి సందడిగా ఉంటుంది. భారీ అంచనాలతో బాక్సాఫీస్ బరిలో దిగిన ‘ఆదిపురుష్’ రెండో వారంలోకి ఎంటర్ అయిపోయింది. కలెక్షన్లు బాగా తగ్గాయి. ఒకసారి అయినా హాళ్లో చూడలనుకున్న వాళ్లు థియేటర్లకు వెళ్తున్నారు. గతవారం చిన్నా చితకా అన్నీ కలిపి ఏకంగా 10 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే జనాలు పెద్దగా పట్టించుకోలేదు సరికదా అసలు టాక్ కూడా తెలియలేదు. ఈ శుక్రవారం కూడా కొన్ని సినిమాలు రాబోతున్నాయి. వాటిలో నిఖిల్ ‘స్పై’ మూవీ మీద మంచి అంచనాలున్నాయి. అలాగు శ్రీ విష్ణు ‘సామజవరగమన’ ట్రైలర్‌తో ఆకట్టుకుంది. ఈ వారం థియేట్రికల్ రిలీజ్ లిస్ట్ ఇలా ఉంది.
స్పై..
‘కార్తికేయ 2’ తర్వాత యంగ్ హీరో నిఖిల్ నటించిన పాన్ ఇండియా ఫిలిం ‘స్పై’. ఐశ్వర్య మీనన్ హీరోయిన్. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక దాగి ఉన్న రహస్యాల ఆధారంగా రూపొందిన ఈ మూవీ జూన్ 29న భారీ స్థాయిలో విడుదలవుతోంది.
సామజవరగమన..
డిఫరెంట్ స్టోరీస్, క్యారెక్టర్లతో అలరిస్తున్న యంగ్ హీరో శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా.. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర సమర్పిస్తున్న లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సామజవరగమన’. మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ..
‘ఇండియానా జోన్స్’ సిరీస్‌లో వచ్చిన యాక్షన్ అండ్ అడ్వెంచర్ మూవీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ జానర్‌లో ‘ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ’ వస్తుంది. ఇండియానా జోన్స్ గా హారిసన్ ఫోర్డ్ మరోసారి అలరించబోతున్నారు. జూన్ 29న ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో భారీగా విడుదల చేస్తున్నారు.
మాయా పేటిక..
పాయల్ రాజ్‌పుత్, సునీల్, శ్రీనివాస రెడ్డి, విరాజ్ ప్రధాన పాత్రల్లో, రమేష్ రాపార్తి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘మాయా పేటిక’. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు జూన్ 30న థియేటర్లలోకి వస్తుంది. ట్రైలర్ మంచి స్పందన దక్కించుకుంది.
లవ్ యూ రామ్..
‘సంతోషం’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు దశరథ్ కథనందించడంతో పాటు నిర్మాణంలో భాగస్వామ్యం వహించిన చిత్రం ‘లవ్ యూ రామ్ – కీప్ లవింగ్ మోర్’. రోహిత్ బెహల్, అపర్ణ జనార్ధనన్ హీరో హీరోయిన్లు. డి.వి. చౌదర్ దర్శక నిర్మాత. జూన్ 30న ఈ యూత్‌ఫుల్ లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది.