సినీ పరిశ్రమలో రాజకీయాల వల్ల ఎంతోమంది కెరీర్ నాశనం అయిపోయిన దాఖలాలు చాలానే ఉన్నాయి. దీని వల్లే నటీనటులు, సాంకేతిక నిపుణులు చాలా మంది కనుమరుగైపోయారు. కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.
సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. 24 క్రాఫ్ట్స్‌కి సంబంధించిన వారు ఎవరైనా సరే ఒక్కసారి లైమ్‌లైట్‌లోకి వచ్చాక, ఆ నేమ్, ఫేమ్ రెండిటినీ కాపాడుకుంటూ ఉండాలి. కెరీర్ పరంగా కాస్త వెనుక బడ్డా కొంత కాలానికి మళ్లీ తిరిగి ట్రాక్‌లోకి రావొచ్చు. అయితే పాలిటిక్స్‌కి గురైతే మాత్రం కోలుకోవడం కష్టం. పరిశ్రమలో రాజకీయాల వల్ల ఎంతోమంది కెరీర్ నాశనం అయిపోయిన దాఖలాలు చాలానే ఉన్నాయి. దీని వల్లే నటీనటులు, సాంకేతిక నిపుణులు చాలా మంది కనుమరుగైపోయారు. కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. తాజాగా ఓ స్టార్ హీరోకి భయపడి సినిమాల నుండి తప్పుకున్న ఒక దర్శకుడిని గురించిన వార్త బాగా వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళ్తే..
కోలీవుడ్ స్టార్ శింబు నటించిన ‘మన్మథన్’ సినిమా ఘన విజయం సాధించింది. తెలుగులో ‘మన్మథ’ పేరుతో విడుదల చేయగా ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. శింబు తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది ఈ మూవీతోనే. యువన్ శంకర్ రాజా సాంగ్స్ చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. చాలా కాలం యూత్ మొబైల్ కాలర్ ట్యూన్స్‌గా ‘మన్మథ’ సాంగ్స్ పెట్టుకున్నారు కూడా. ఇందులో అన్నాదమ్ముళ్లుగా ద్విపాత్రాభినయం చేశాడు శింబు. జ్యోతిక హీరోయిన్. ఎస్.కె.కృష్ణకాంత్ నిర్మాత. ఎ.జె.మురుగన్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. కానీ ఈ సినిమా తర్వాత మరో చిత్రం చేయకుండానే తమిళ్ ఇండస్ట్రీ నుండి వెళ్లి పోయాడు.
దానికి కారణం శింబు అండ్ ఫ్యామిలీ అని కోలీవుడ్‌లో కథనాలు వినిపించాయి. మురుగన్, ‘తల’ అజిత్ కుమార్ వీరాభిమాని. ఆయన కోసం ‘మన్మథ’ కథ రెడీ చేసుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల శింబుకి కథ చెప్పడానికి వెళ్లాడు. స్టోరీ విని ఇంప్రెస్ అయిన శింబు, 25 వేల అడ్వాన్స్‌తో పాటు ఓ మొబైల్ ఫోన్ గిఫ్ట్ ఇచ్చాడు. నిర్మాత ఆఫీస్ తీశాడు. ఇంతలో దర్శకుడికి శింబు అతని తండ్రి టి.రాజేందర్ అన్యాయం చేయబోతున్నారని గ్రహించిన ప్రొడ్యూసర్ అదే విషయాన్ని మురుగన్‌కి చెప్పాడు కానీ తను లైట్ తీసుకున్నాడు. కట్ చేస్తే ఒకరోజు శింబు, తల్లి ఉషా, తండ్రి రాజేందర్ ముగ్గురూ ఆఫీస్‌కి వచ్చి సినిమా స్టోరీ, స్క్రీన్‌ప్లే రైట్స్ శింబు పేరు మీద రాయమని బలవంతం చేశారట.
రాజేందర్ అసిస్టెంట్స్ కూడా బెదిరించారట. రాయకపోతే కెరీర్ ఏమైపోతుందోననే భయం, తన అభిమాన హీరో కోసం రాసుకున్న కథతో ఇంకో హీరోతో సినిమా చేస్తున్నాననే బాధ ఉన్నా దర్శకుడిగా పేరు వస్తుందనే నమ్మకంతో సంతకం చేయాల్సి వచ్చింది. డైరెక్టర్‌గా మొదటి సినిమాతోనే భారీ విజయం, పేరు వచ్చాయి. కథ, స్క్రీన్‌ప్లేతో పాట దర్శకత్వ పర్యవేక్షణ అంటూ తన పేరు వేసుకున్నాడు శింబు. దర్శకుడిగా పేరొచ్చినా కానీ బలవంతంగా రైట్స్ రాయించుకున్నారనే అవమానం మాత్రం మురుగన్ మనసులో అలానే ఉండిపోయింది. తనలాంటి పరిస్థితి మరో దర్శకుడికి రాకూడదను అని సన్నిహితుల వద్ద చెప్పుకుని బాధపడ్డాడట. అలా శింబు, అతని తండ్రి చేసిన దారుణమైన మోసం కారణంగా మురుగన్ ఒక్క చిత్రంతోనే పరిశ్రమ నుండి తప్పుకున్నాడు.