అభిమాన నటుడు సినిమా ప్రకటన మొదలైన దగ్గర నుండి థియేటర్లలో బొమ్మ పడేవరకు చాలా ఎగ్జైట్‌మెంట్‌తో ఎదురు చూస్తారు. ఇక సినిమా విడుదలయ్యే ముందు రోజు నుండి ఫ్యాన్స్ హడావుడి అంతా ఇంతా కాదు. అయితే అభిమానం కొంపలు ముంచుతుంది
ఒక సాధారణ హీరోని స్టార్ హోదాకు తీసుకెళ్లేది అభిమానులే. తమ అభిమాన నటుడు సినిమా ప్రకటన మొదలైన దగ్గర నుండి థియేటర్లలో బొమ్మ పడేవరకు చాలా ఎగ్జైట్‌మెంట్‌తో ఎదురు చూస్తారు. ఇక సినిమా విడుదలయ్యే ముందు రోజు నుండి ఫ్యాన్స్ హడావుడి అంతా ఇంతా కాదు. థియేటర్ దగ్గర భారీ కటౌట్లు, పాలాభిషేకాలు, పూలతో అలంకరణతో పండుగ వాతావరణాన్ని తీసుకువస్తారు. అయితే ఈ అభిమానం ఒక్కోసారి హద్దులు మీరుతుంటుంది. హీరో కోసం రక్తంతో తిలకందిద్దడం, బొమ్మ టైంకి పడగకపోతే రచ్చ చేయడం, థియేటర్లలో బాణా సంచాలు పేల్చి థియేటర్లను తగలబెట్టడం వంటి చర్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు మరో హీరో విషయంలో అదే జరిగింది.
పాన్ ఇండియా స్టార్, బాక్సాఫీసు రారాజు డార్లింగ్ ప్రభాస్ సినిమా ఆది పురుష్ ఈ రోజు నుండి థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే సినిమా విడుదల సందర్భంగా భారీ కటౌట్లు కట్టి నానా హంగామా చేస్తున్నారు అభిమానులు. రాత్రి నుండి సినిమా హాళ్ల దగ్గర నుండి పడిగాపులు కాస్తున్నారు. అదేవిధంగా బెన్ ఫిట్ షోలు చూసిన వారంతా బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. టపాసులు పేల్చి హంగామా సృష్టించారు. అయితే అభిమానం హద్దులు దాటేసింది. రివ్యూస్ చెప్పేవాళ్లకు మాస్ వార్నింగ్స్ కూడా ఇచ్చారు. సౌండ్ సిస్టమ్స్ బాగోలేదని ఓ థియేటర్ అద్దాలు పగులగొట్టారు. ఇప్పుడు ఓ అభిమాని మాత్రం ఏకంగా.. తన వీరాభిమానాన్ని ప్రదర్శించే ప్రయత్నంలో అనాలోచిత చర్యకు పాల్పడ్డాడు.
అందరికీ అభిమానులుంటే.. ప్రభాస్‌కు డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. అదే కొన్ని సార్లు కొంపముంచుతుంది. సినిమా చూశానన్న ఆనందంలోనో, చూస్తానన్న ఆనందలోనో ప్రభాస్ కటౌట్ ఎదురుగా.. ‘జై రెబల్ స్టార్’అంటూ చేతిలో ఉన్న బీరు బాటిల్ పగుల కొట్టి.. దాంతో చేతిని పరా పరా కోసేసుకున్నాడు. అతడికి రక్తం రాగా, తన రక్తంతో కటౌట్‌లో ఉన్న ప్రభాస్‌కు వీర తిలకం దిద్దాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది. అయితే ఈ చర్యను చాలా మంది నెటిజన్లు ఖండిస్తున్నారు. అభిమానం ఉండొచ్చు కానీ.. ఇలా చేయోద్దు చాలా సాఫ్ట్‌గా మందలిస్తూ, బండ బూతులు తిడుతూ కామెంట్లు పెడుతున్నారు. ఆదిపురుష్‌లో రాముడిగా కనిపించారు ప్రభాస్. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో విడుదలైంది.
Offline cult fans 🥵🔥
Beer bottle cheyyi koskunnadu 🙏🏼#Prabhas #Adipurush #AdipurushCelebrations pic.twitter.com/FZl3PfAww1
— ❌ BEAST ❌ (@thedevilmonstr) June 16, 2023