తమన్నాని చూస్తే.. తెల్లగా నిగనిగ మెరిసిపోయే బ్యూటీనే గుర్తొస్తుంది. అలాంటి తమన్నాని డీ గ్లామర్ లుక్ లో ఎప్పుడైనా చూశారా? కచ్చితంగా చూసుండరు. ఇప్పుడు అలాంటి ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
‘తమన్నా’.. ఈ పేరు వినగానే అందరికి ‘మిల్కీ బ్యూటీ’ అనే పదం గుర్తుకొస్తుంది. తమన్నా అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన కలర్ తో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించింది. తనకు మిల్కీ బ్యూటీ అని బిరుదు ఇచ్చారంటే ఎంత తెల్లగా ఉంటుందో, తన అందం ఏ తరహాలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. మాములుగా హీరోయిన్లకు మ్యాకప్ వేస్తే తెల్లగా ఉంటారు. కానీ తెల్లగా ఉండే తమన్నా కి మ్యాకప్ వేస్తే అచ్చం అతిలోక సుందరిలా ఉంటుంది. కేవలం తన గ్లామర్ తోనే కాకుండా డాన్స్, యాక్టింగ్ లాంటి విషయాల్లో మెప్పించి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. బెంగాల్ టైగర్ లో చూపులతో దీపాల, బాహుబలి సినిమాలో దీవరా అనే సాంగ్స్ లో తమన్నా గ్లామర్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడొచ్చు. అలాంటి తమన్నాని బ్లాక్ బ్యూటీగా ఉహించుకోగలమా? అయితే.. అలాంటి ఓ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తమన్నా సినిమాల్లోకి రాకముందు ఒక యాడ్ లో నటించింది. ఆ యాడ్ లో తమన్నా డీగ్లామరస్ గా కనిపించాల్సి వచ్చింది. సహజంగా తమన్నా తెల్లగా ఉంటుంది కాబట్టి సరిగ్గా దానికి సరిపోయే యాడ్ లో నటించింది అని చెప్పవచ్చు. ఆ యాడ్.. ఫెయిర్ అండ్ లవ్లీ అంటి మార్క్స్ క్రీం కోసం చేసింది. ఇదే తమన్నా కెరీర్ లో తొలి యాడ్ కావడం విశేషం. ఈ యాడ్ కి సంబంధించి మొదట డీగ్లామరస్ గా కనిపించాలి. ఫెయిర్ అండ్ లవ్లీ అంటి మార్క్స్ క్రీమ్ కాబట్టి ఆ తరవాత తెల్లగా కనిపించాలి. దీని కోసం తమన్నా ని డీ గ్లామరస్ గా చూపించాల్సి వచ్చింది. ఆలా డీ గ్లామరస్ గా కనిపించిన తమన్నా ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో లో వైరల్ అవుతోంది. ఇది చూసిన అందరూ ఏంటి ఈమె తమన్నానా ?అని ఒక్క క్షణం షాక్ అయిపోయారు. కానీ అసలు విషయం తెలుసుకుని అవాక్కవుతున్నారు.
నిజానికి తమన్నాకి సినీ కెరీర్ సెట్ అవ్వడానికి కారణం కూడా ఈ యాడ్ మాత్రమే. ఇందులో తమన్నాని చూశాకా.. ఆమెకు ఓ బాలీవుడ్ మూవీలో అవకాశం లభించింది. ఆ తరువాత మంచు మనోజ్ డెబ్యూ మూవీ “శ్రీ” తో తెలుగు వారికి పరిచయం అయ్యింది. ఆ తరువాత వచ్చిన “హ్యాపీ డేస్” తమన్నాకి స్టార్ స్టేటస్ తెచ్చి పెట్టింది. ప్రస్తుతం తమన్నా వరుస ప్రాజెక్టు లతో సీనియర్ హీరోలతో నటిస్తూ బిజీ గా గడుపుతుంది. తమిళంలో “జైలర్” మూవీ లో రజినీకాంత్ సరసన నటిస్తుండగా, తెలుగులో మెగాస్టార్ చిరంజీవి తో భోళా శంకర్ అనే సినిమాలో నటిస్తుంది. ఏమైనా తమన్నా ఇలా డీ గ్లామరస్ పిక్.. ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుండటం విశేషం. మరి తమన్నా డీ గ్లామర్ లుక్ చూసిన తర్వాత మీకేం అనిపించింది. కింద కామెంట్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.