ఎక్కువగా సెలబ్రిటీల వైవాహిక జీవితాలకి అనారోగ్యం కలుగుతుంటుంది. బాలీవుడ్లో అయితే ఈ జబ్బు మరీ ఎక్కువ. భార్యా, భర్తల మధ్య అండర్ స్టాండింగ్ సరిగా లేక తమ స్టాండ్‌ను మార్చేసుకుంటూ ఉంటారు. తమకి కావాల్సిన ప్రేమ భాగస్వామి దగ్గర దొరకడం లేదని క్షణాల్లో మనసు మార్చేసుకుంటారు. మాజీ భాగస్వామి ముందే ప్రేమించిన వ్యక్తులతో చట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటారు. ఈ కోవకి చెందిన వారే బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, అతని భార్య సుసానే ఖాన్. పెళ్ళి చేసుకున్నారు, సెట్ అవ్వలేదని విడిపోయారు. చెరో ప్రపంచం చేరుకున్నారు. ఎవరి జీవితం వారిది అన్నట్టు ఉంటున్నారు. సుసానే ప్రియుడ్ని వెతుక్కోగా, హృతిక్ ప్రియురాలిని వెతుక్కున్నారు. ఇప్పుడు హృతిక్ మాజీ భార్య రెండో పెళ్ళికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ రెండో పెళ్ళికి సిద్ధమైనట్లు బీటౌన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. హృతిక్ నుండి విడిపోయిన సుసానే ఖాన్ ప్రస్తుతం అర్స్లాన్ గోనీతో ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఈ ఇద్దరూ ముంబై రోడ్ల మీద చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. డిన్నర్ డేట్స్‌కు, పార్టీలకు ఎక్కడకి వెళ్ళినా కలిసే వెళ్తున్నారు. బర్త్‌డేలు, అకేషన్స్‌లో ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా ప్రేమ కురిపించుకునేవారు. త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్ళిపీటలు ఎక్కనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక హృతిక్ రోషన్ సింగర్ సబా అజాద్‌తో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈయన కూడా రెండో పెళ్ళికి సిద్దమవుతారని వార్తలు వస్తున్నాయి. 2000వ సంవత్సరంలో హృతిక్ రోషన్, సుసానే ఖాన్ల వివాహం జరుగగా.. 2014లో విడిపోయిన సంగతి తెలిసిందే. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.