టాలీవుడ్లో స్టైలిష్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న జంటల్లో అల్లు అర్జున్, స్నేహా రెడ్డి జంట ఒకటి. ఈ ఇద్దరూ ట్రెండ్‌ని ఫాలో అవుతూ ఉంటారు. లేటెస్ట్ ఫ్యాషన్‌తో అటు అల్లు అర్జున్, లేటెస్ట్ అవుట్ ఫిట్స్, లేటెస్ట్ యాక్ససరీస్‌తో ఇటు స్నేహా రెడ్డి ఇద్దరూ లేటెస్ట్ ట్రెండ్స్‌ని పరిచయం చేస్తుంటారు. బన్ని ఐకాన్ స్టార్ అయితే, స్నేహా రెడ్డి లేడీ ఐకాన్ స్టార్. ఇటీవలే అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ముగించుకుని ఇంటికి వచ్చిన విషయం తెలిసిందే. పుష్ప సినిమా హిట్ తర్వాత బ్రేక్ దొరకడంతో బన్ని.. భార్య, పిల్లలతో కలిసి ఆఫ్రికా దేశమైన టాంజానియా అడవుల్లో పర్యటించారు. టాంజానియాలోని సెరెంగేటి నేషనల్ పార్క్‌లో బన్ని, స్నేహా రెడ్డి, కొడుకు అయాన్, కూతురు అర్హ.. నలుగురూ ఆ ప్రకృతి అందాలను ఆస్వాదించారు. గత నెలలో వెకేషన్ పూర్తి చేసుకుని తిరిగి వచ్చారు. అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్లో పాల్గొనేందుకు రెడీ అవుతుండగా.. స్నేహా మాత్రం ఫోటో షూట్లో పాల్గొన్నారు. తల అలా కాస్త పక్కకి వాల్చి, రెండు చేతులూ టేబుల్ మీద పెట్టి, వయ్యారి భామలా నిలబడి కెమెరాకు ఫోజిచ్చారు. శాండిల్ లైట్ కాంతిలో మేడమ్ అప్సరసలా మెరిసిపోతున్నారు. వేలాడుతున్న చెవిరింగులు, ఆ జడ, బ్లాక్ కలర్ డ్రస్‌లో చాలా అందంగా ఉన్నారు. ఈ ఫోటోలో ఆమెని చూసిన నెటిజన్లు.. మేడమ్ సార్ మేడమ్ అంతే అని కామెంట్లు చేస్తున్నారు. రియల్ లైఫ్‌లోనూ హీరోయిన్లా అందంగా ఉండే స్నేహా రెడ్డి.. భర్త సినిమాలో హీరోయిన్గా నటించే ఫీచర్స్ కనబడుతున్నాయని అంటున్నారు. నిజమే మరి ఈ ఫోటోలో ఆమెని చూస్తుంటే.. హీరోయిన్లెవరూ సాటిరారనిపిస్తుంది. ఇక ఈ అవుట్‌ఫిట్‌ను ప్రముఖ మోడల్, స్టైలిస్ట్ జుకాల్కర్ డిజైన్ చేయగా.. ఐటీఆర్హెచ్ క్లాతింగ్ బ్రాండ్‌కి చెందిన అవుట్‌ఫిట్ అని ఆమె తన పోస్ట్‌లో వెల్లడించారు. మేకప్, హెయిర్ స్టైల్ సద్నా సింగ్ చేశారని, రాధికా డైమండ్స్ వారి ఇయర్ రింగ్స్ ధరించానని, తన్మయ్మెయిన్కర్ స్టూడియోలో ఫోటో షూట్ దిగానని స్నేహా రెడ్డి పేర్కొన్నారు. మొత్తానికి హీరోయిన్లకేం తీసిపోని విధంగా కెమెరా ముందు దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హీరోయిన్ల పొట్ట కొట్టకండి మేడమ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) ఇది కూడా చదవండి: రేప్ చేస్తామంటూ నటికి బెదిరింపులు.. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన.. ఇది కూడా చదవండి: డిల్లీ, రోలెక్స్ ల ఫైట్ ఎలా ఉండబోతుందో రివీల్ చేసిన సూర్య, కార్తీ!