సెలబ్రిటీలన్నాక ట్రోలింగ్లకి గురవ్వడమన్నది మామూలే. ట్రోలర్స్ నిత్యం ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూనే ఉంటారు. వాళ్ల రీజన్స్ వాళ్ళకి ఉన్నా గానీ సెలబ్రిటీలు మాత్రం చాలా బాధపడతారు. ఇలాంటి వారిలో బాలీవుడ్ నటి, మోడల్ ఉర్ఫీ జావేద్ ఒకరు. ఈ ట్రోల్స్ విషయంలో తాను ఎంతగానో బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది ఉర్ఫీ. గత కొంతకాలంగా నెటిజన్లు ఉర్ఫీని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెని అసభ్యపదజాలంతో దూషిస్తున్నారు. కొంతమంది ఏకంగా రేప్ చేస్తామంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై ఉర్ఫీ సీరియస్ అయ్యింది. ఆమె స్క్రీన్ షాట్లు తీసి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హెచ్చరిస్తున్నా గానీ జనాలు మారడం లేదు. తనపై వస్తున్న ట్రోల్స్, రేప్ చేస్తామంటూ బెదిరిస్తున్న వ్యక్తుల గురించి ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఇండియాలో సైబర్ చట్టాలు సరిగా లేవని, ఫిర్యాదు చేసినా సరైన స్పందన ఉండడం లేదని, దీంతో ప్రజలు కూడా కంప్లైంట్లు ఇవ్వడం మానేస్తున్నారని' ఆమె స్టోరీలో రాసుకొచ్చింది. ఆకతాయిలకు అడ్డుకట్ట వేయడంలో చట్టాలు విఫలమవ్వడంతో.. ఓపెన్‌గా అమ్మాయిల్ని తిడుతున్నారని, వేధిస్తున్నారని, ఏకంగా రేప్ చేస్తామని బెదిరిస్తున్నారని, ఇలాంటి వాళ్ళని ఎందుకు వదిలేయాలని ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది. రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ చేసినప్పుడు.. ఆయనపై కేసు నమోదయ్యింది. అప్పుడు కొంతమంది ఉర్ఫీ జావేద్ హాట్ ఫోటో షూట్స్ ప్రస్తావన తీసుకొస్తూ.. ఉర్ఫీ మీద కూడా కేసు పెట్టాలని ట్రోల్స్ చేశారు. ఇలాంటి విషయాల్లో లింగ వివక్ష చూపించకూడదని ఉర్ఫీని మధ్యలోకి లాగారు. అయితే దీనిపై స్పందించిన ఉర్ఫీ.. తనను ఈ వివాదంలోకి లాగకుండా కూడా రణ్‌వీర్‌కి సపోర్ట్ చేయవచ్చునని సలహా ఇచ్చారు. దీంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడం, అసభ్యకరమైన కామెంట్స్‌తో బెదిరించడం వంటివి చేశారు. మరి ఉర్ఫీ జావేద్ కామెంట్స్‌పై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి. View this post on Instagram A post shared by Uorfi (@urf7i) ఇది కూడా చదవండి: Hansika: ప్రముఖ వ్యక్తితో పెళ్లి పీటలెక్కబోతున్న హీరోయిన్ హన్సిక..? ఇది కూడా చదవండి: పవన్ కళ్యాణ్ కు బండ్ల గణేష్ విన్నపం! ట్వీట్ వైరల్..