కొందరు మైక్ పట్టుకుంటే సంచలనం.. మరికొందరు మాట్లాడితే సంచలనం.. ఇంకొందరు ట్వీట్ చేస్తే హాట్ టాపిక్.. ఇవన్నీ ఒకే వ్యక్తి చేస్తే.. అవును ఆయన ఏం చేసినా ఇండస్ట్రీ మెుత్తం ఆయన వైపే చూసేలా చేసుకుంటాడు. ఆయనే నిర్మాత బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ పై ఇచ్చిన ఒకే ఒక్క స్పీచ్ తో ఆయన పేరు మారుమ్రోగిపోయింది. తాజాగ పవన్ కళ్యాణ్ పై మరో ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు బండ్ల గణేష్. దానికి సంబంధించి మరిన్ని విషయాల్లోకి వెళితే.. ''ఈశ్వరా.. పవనేశ్వరా''..! అనగానే మనకు గుర్తుకు వచ్చే ఒకే ఒక వ్యక్తి బండ్ల గణేష్.. బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కు పరమ భక్తుడు అన్న విషయం రెండు తెలుగు రాష్ట్రాల సిని అభిమానులకు తెలిసిందే! పవన్‌కు సంబంధించిన ఏ వేడుక వేదిక మీదైనా సరే బండ్ల తన దైన శైలి మాటలతో ఊగిపోతుంటారు. ఆ మాటలతో అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంటారు. ఆయన అప్పుడప్పుడు ట్విట్టర్ వేదికగా మాటల తూటాలను వదులుతుంటారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. గబ్బర్‌సింగ్ లోకేషన్‌లో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. ''నా దైవ సమానులైన పవన్ కళ్యాణ్.. తెలుగు చలనచిత్ర చరిత్రలో రికార్డులు తిరగరాసే సినిమా త్వరగా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మిమ్మల్ని అర్థం చేసుకుని, మిమ్మల్ని ప్రేమిస్తూ.. మీ ప్రేమను పొందుతూ సినిమా తీస్తే అది బాక్స్ బద్దలే'' అని ఆయన ట్వీట్ చేశారు. మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని ప్రేమిస్తూ మీ ప్రేమను పొందుతూ సినిమా తీస్తే బాక్స్ బద్దలే @PawanKalyan pic.twitter.com/G4YcSUHTQE — BANDLA GANESH. (@ganeshbandla) August 6, 2022 తాజాగా విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న బింబిసార, సీతారామం మూవీ యూనిట్ కు అభినందనలు తెలియజేశాడు. అయితే బండ్ల చేసిన ట్వీట్‌కు మెగా అభిమానులు అభిమానులు సంబరపడిపోతున్నారు. బండ్ల ట్వీట్‌కు పవన్ ఫ్యాన్స్ స్పందించారు. 'పవన్‌తో మళ్లీ సినిమా చేస్తున్నారా?' తీస్తే ఏలాంటి మూవీ తీస్తారు? అంటూ పలు ప్రశ్నలు అడిగారు. మరి బండ్ల గణేష్ పవర్ స్టార్ పై చేసిన ట్వీట్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా దైవ సమానులైన మా @PawanKalyan మీరు తెలుగు చలన చిత్ర చరిత్రలో రికార్డులు తిరగరాసే సినిమా త్వరగా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బండ్ల గణేష్ pic.twitter.com/OtHMCRIHl1 — BANDLA GANESH. (@ganeshbandla) August 6, 2022 ఇదీ చదవండి: బింబిసార మూవీలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గురించి తెలియని విషయాలు! ఇదీ చదవండి: సమంత అంటే నాకు ఇప్పటికీ గౌరవమే: నాగచైతన్య