ఈ మద్య కాలంలో చాలా మంది ప్రముఖులు తమ వైవాహిక జీవితానికి పులిస్టాప్ పెట్టిన సంగతి తెలిసిందే. ప్రేమించి కొందరు, పెద్దలను ఒప్పించి కొందరు పెళ్లిళ్ళు చేసుకున్నప్పటికీ తమ వైవాహిక జీవితాల్లో ఇబ్బందులు ఎదుర్కొని విడాకులు తీసుకున్నారు. అయితే తమ జీవితంలో తమను ఇష్టపడే వ్యక్తులను రెండో పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే.
తమిళ ఇండస్ట్రీలో తన సంగీతంతో ఎంతో మందిని అభిమానం సొంతం చేసుకున్న డి ఇమ్మాన్ ద్వితీయ వివాహం చేసుకున్నారు. గతంలో ఆయన మోనికా రిచర్డ్స్ ని వివాహం చేసుకున్నప్పటికీ కొంత కాలం తర్వాత మనస్పర్థల కారణంగా గతేడాది విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచి ఏడాది తర్వాత సోషల్ మీడియా వేదికగా విడాకుల ప్రకటన చేశారు. ఈ విషయం కోలీవుడ్ నాట చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆయనకు కోలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ ఉబాల్డ్ కుమార్తె అమేలీతో రెండో వివాహం జరిగింది.. వీరి వివాహానికి కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు.
సినీ ఇండస్ట్రీకి చెందిన కొద్ది మంది మాత్రమే పాల్గొన్నారు. తమిళ నాట పలువురు స్టార్ హీరోల సినిమాలకు ఈయన సంగీతం అందించారు. అజిత్ నటించిన విశ్వాసం మూవీకి నేషనల్ అవార్డు దక్కించుకున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.