సినిమారంగంలోకి అనేక మంది తారలు వస్తుంటారు. వీరిలో కొంతమంది మాత్రమే స్టార్ హీరోయిన్ గా రాణిస్తారు. అటువంటి స్టార్ హీరోయిన్ల జాబితాలో శ్రీలీల ఒకరు. వెండితెరకు పరిచయమైన అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ ల లిస్ట్ లో చేరిపోయింది ఈ ముద్దుగుమ్మ.
మత్తెక్కించే అందం, చురుకైన చూపులు, అదిరిపోయే డ్యాన్స్, మైమరపించే నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది శ్రీలీల. టాలీవుడ్, కోలివుడ్ లలో సినిమాలు చేసిన శ్రీలీల కిస్ సినిమాతో కన్నడ పరిశ్రమకు పరిచయమైంది. కాగా శ్రీలీల బాల నటిగా కూడా నటించిన సినిమా ఉంది. ఆ సినిమా ఏదో ఇప్పుడు తెలుసుకుందాం.
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమయ్యింది. మొదటి సినిమాతోనే తన నటనతో మెప్పించింది. ఆ తరువాత ధమాకా సినిమాలో రవితేజ సరసన నటించింది. శ్రీలీల తన అందం, నటనతో ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. శ్రీలీల కోసం నిర్మాతలు ఎదురుచూసేంత స్థాయికి చేరింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమాల్లోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన గర్తింపు ఈమెకే దక్కుతుంది. మెడిసిన్ చదువుతున్న ఈ అమ్మడు దానిని కొనసాగిస్తూనే సినిమాల్లో దూసుకుపోతుంది.
వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంటోంది. మహేష్ బాబు సరసన గుంటూరు కారంలో, నితిన్ తో కలిసి ఓ సినిమా చేస్తుంది. భగవంత్ కేసరి సినిమాలో ఓ లీడ్ రోల్ లో అలరించనుంది. టాలీవుడ్ ఎనర్జటిక్ హీరో రామ్ పోతినేని తో కలిసి ఓ సినిమా చేస్తోంది. ఆహా ఓటిటి కోసం అల్లు అర్జున్ తో కలిసి ఓ ప్రాజెక్ట్ చేయనున్నది. అయితే శ్రీలీల హీరోయిన్ గా చేయడానికంటే ముందే తెలుగులో వచ్చిన ఓ సినిమాలో బాలనటిగా నటించింది. దీనికి సంబంధించి తెలుగులో అంజలి హీరోయిన్ గా నటించిన ‘చిత్రాంగద’ అనే సినిమాలో అంజలికి ఫ్రెండ్ గా సింధు తులాని నటించింది. ఆమెకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ లో చిన్నప్పటి పాత్రలో నటించింది శ్రీలీల. లేత అందాలతో మత్తెక్కిస్తూ కుర్రకారును ఊపేస్తోంది శ్రీలీల.