Singer Vagdevi: ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’ నిర్వహించిన ‘తెలుగు ఇండియన్ ఐడల్’ మొదటి సీజన్ లో యువగాయని బీవీకే వాగ్దేవి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. తన మధురమైన కంఠంతో.. సంగీత జ్ఞానంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా తెలుగు ఇండియన్ ఐడల్ ట్రోఫీతో పాటు రూ. 10 లక్షల నగదు బహుమతి కూడా అందుకున్నారు. ఆ వెంటనే గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మాణంలో ఓ సినిమాలో పాట పాడే అవకాశం చేజిక్కించుకున్నారు. అంతేకాదు! చిరంజీవి తన ‘గాడ్ ఫాదర్’ మూవీలో వాగ్దేవికి పాట పాడే అవకాశం ఇస్తున్నట్టు ప్రకటించారు. అదే సమయంలో ప్రముఖ సింగర్ కార్తీక్ తాను సంగీతం అందించే తదుపరి చిత్రంలో వాగ్దేవికి అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. ఇలా తన విజయంతో వరుస ఆఫర్లను అందుకున్న వాగ్దేవి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు.
అయితే, వాగ్దేవిలోని ప్రతిభను ప్రముఖ సంగీత దిగ్గజం ఎస్పీ బాలు ఎప్పుడో గుర్తించారు. కొన్నేళ్ల క్రితమే ఆమె గొప్ప సింగర్ అవుతుందని కూడా జోష్యం చెప్పారు. ఆమె పాట పాడిన విధానాన్ని ‘ఫస్ట్‌క్లాస్’ అంటూ కితాబిచ్చారు. 2014లో వాగ్దేవి పాడుతా తీయగాలో పాల్గొన్నారు. ఓ ఎపిసోడ్లో ‘‘ఆత్మబలం’’ సినిమాలోంచి ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ అనే పాట పాడారు. ఆ పాట విన్న తర్వాత బాలుగారు జడ్జిమెంట్ ఇస్తూ.. ‘‘ ఫస్ట్ క్లాస్! వేరే ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు’’అంటూ ముగించారు. అలా బాలు అన్నట్లుగానే ఎనిమిదేళ్ల తర్వాత ‘తెలుగు ఇండియన్ ఐడల్’లో వాగ్దేవి ఫస్ట్ క్లాస్‌లో నిలిచారు.
ప్రస్తుతం 8 ఏళ్ల క్రితం నాటి వీడియో వైరల్‌గా మారింది. కాగా, ఎస్పీ బాలు జడ్జిగా వ్యవహరించిన ‘పాడుతా తీయగా’ ఎంతో మంది ఓత్సాహిక సింగర్లకు ఓ దారి చూపింది. ఆ కార్యక్రమం ద్వారా ఎంతో మందిని సంగీతంలో పట్టు సాధించేలా తీర్చిదిద్దారు. ఆ కార్యక్రమం ద్వారానే నేడు ఇండస్ట్రీలో స్టార్ సింగర్లుగా వెలుగొందుతున్న వారు పరిచయం అయ్యారు. ఒకరు కాదు! ఇద్దరు కాదు! పదుల సంఖ్యలో స్టార్ సింగర్లను తీర్చి దిద్దిన ఘనత బాలు గారికే దక్కుతుంది. బాలుగారు తమిళంలోనూ చాలా సింగింగ్ షోలను నిర్వహించారు. ఎంతో మంది సింగర్లను వెండి తెరకు పరిచయం చేశారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
ఇవి కూడా చదవండి : RRR Intervel Fight: RRR ఇంటర్వెల్ ఫైట్ లో అసలు పులి లేదా? ఎంతకి తెగించారు మావ!