మనో.. దక్షిణాధి చిత్ర పరిశ్రమలో సింగర్ గా, నటుడుగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇలా ఎన్నో విభాగాల్లో రాణించి విశిష్ట గుర్తింపును దక్కించుకున్నాడు. అయితే తాజాగా మనో ఓ కార్యక్రమంలో కటుంబ సమేతంగా పాల్గొని తన మనో గతాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. తను సినిమా ఇండస్ట్రీకి రాకముందు అనేక కష్టాలు పడ్డానని, తిండి దొరక్క ఎన్నో తిప్పలు పడ్డానని ఆయన అన్నారు.
ఇక నా చిన్న తనంలోనే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టానని, చక్రవర్తి వద్ద హర్మోనియం వాయించటం, పాటలు పాడటం, గాయకులకు పాటలు నేర్పించటం వంటివి చేశానని గత చరిత్ర అనుభవాలను తెలియజేశారు సింగర్ మనో. దీంతో పాటు నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తిగా భావించేది మాత్రం సోదరి హిమజ అని అన్నారు. ఆమె వల్లే నేను ఇలా స్థిరపడగలిగానని తెలిపారు. ఇక నా భార్యగా జమిలే దొరకటం నా అదృష్టమని, ఇంటి బాధ్యతలను మోస్తు నాకు ఎన్నో విధాలుగా తోడుగా నిలిచిందని మనో తెలిపారు.
మా అమ్మనాన్నలు జీ ఆనంద్ గారి వద్ద పనిచేసేవారన్నారు. ఇక అప్పట్లో మంచి భోజనం చేయాలంటే పాండి బజర్ లోని కళ్యాణ మండపాలకు వెళ్లే వాడిని. ఒక సారి వెళ్లానంటే మళ్లీ 15 రోజుల వరకూ అక్కడికి వెళ్లే వాడిని కాదని మనో తెలిపారు. ఇలా తన గతంలో జరిగిన కొన్ని విషయాలను పంచుకున్నారు మనో. అయితే మనో ప్రస్తుతం జబర్దస్త్ షోలో కనపిస్తూ అందిరినీ నవ్విస్తూ ఉన్నారు.