ఓ నటిని నెల రోజుల క్రితమే పెళ్లి చేసుకున్నాను అని తాజాగా ప్రకటించి షాకిచ్చాడు స్టార్ సింగర్. పెళ్లినాటి ఫోటోలను షేర్ చేసి మరి ఈ విషయాన్ని వెల్లడించాడు. మరి ఆ స్టార్ సింగర్ ఎవరో? ఆ నటి ఎవరో? వివాహం అయిన సంగతి ఎందుకు దాచాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా సెలబ్రిటీలు తమ పర్సనల్ విషయాలను అభిమానులతో పంచుకోడానికి ఇష్టపడరు. చాలా కొద్ది మంది నటీ, నటుల మాత్రమే తమ పర్సనల్ విషయాలను ఇతరులతో, అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఈ మధ్య కాలంలో అయితే కొంత మంది సెలబ్రిటీలు తమకు పెళ్లి జరిగిన విషయాలను కూడా దాచిపెడుతున్నారు. ఇటీవలే బాలీవుడ్ నటి స్వర భాస్కర్ పెళ్లి జరిగిన నెలకు తనకు వివాహం జరిగింది అని వెల్లడించి అందరిని షాక్ కు గురించేసింది. తాజాగా ఓ స్టార్ సింగర్ సైతం ఇలాంటి షాకే ఇచ్చాడు అభిమానులకు. ఓ నటిని నెల క్రితమే వివాహం చేసుకున్నాను అని తాజాగా వెల్లడించాడు.
పెళ్లి విషయాలు బయటికి చెప్పకుండా ఉండటంలో బాలీవుడ్ సెలబ్రిటీలను మించిన వారు లేరు. మెున్న బాలీవుడ్ బ్యూటీ స్వర భాస్కర్ తనకు ఓ రాజకీయ వేత్తతో వివాహం జరిగిందని ఫోటోలు షేర్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చింది. తాజాగా ఇదే దారిలో వెళ్లాడు స్టార్ సింగర్ హర్షిత్ సక్సేనా. నెల రోజుల క్రితమే ఓ నటిని పెళ్లి చేసుకున్నాను అంటూ తాజాగా ప్రకటించాడు. ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్షిత్ సక్సేనా మాట్లాడుతూ..”నటి సమోనికా శ్రీవాత్సవను ఫిబ్రవరి 9న పెళ్లి చేసుకున్నాను. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. ఇక పెళ్లికి రెండు రోజుల ముందే మా నిశ్చితార్థం జరిగింది. తర్వాత అతి కొద్ది మంది బంధువల సమక్షంలో మా వివాహం ఛత్తీస్ ఘడ్ లో ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో జరిగింది” అని హర్షిత్ చెప్పుకొచ్చాడు.
అయితే పెళ్లి విషయాన్ని దాచడానికి గల కారణాన్ని కూడా వెల్లడించాడు ఈ సింగర్. వరుసగా తనకు సింగింగ్ షెడ్యూల్స్ ఉండటంతో, ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు. అయితే ఫ్రెండ్స్ కోసం రిసెప్షన్ ఏర్పాటు చేస్తానని హర్షిత్ అన్నాడు. ఇక నేను, సమోనికా ఫస్ట్ టైమ్ ముంబైలో కలిశాం. అప్పటి నుంచి మా మధ్య పరిచయం పెరిగింది. అయితే మా పరిచయాన్ని మా ఇంట్లోవాళ్లు ప్రేమగా భావించారు. సమోనికా అమ్మ మా తల్లిదండ్రులతో మాట్లాడటంతో మా వివాహనికి అడుగులు పడ్డాయి అని ఈ స్టార్ సింగర్ చెప్పుకొచ్చాడు. మరి ఎవరికీ చెప్పకుండా నెల రోజుల క్రితమే పెళ్లి చేసుకున్న సింగర్-నటిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.