సాధారణంగా ఇండస్ట్రీలో ఓ హీరోపై మరో హీరో.. ఏదో ఒక సందర్భంలో ప్రశంసలు గానీ, విమర్శలు గానీ చేస్తుంటారు. ఇక మరికొంత మంది హీరోలు ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నల్లో భాగంగా మరో హీరోపై తమ అభిమానాన్ని చాటి చెబుతుంటారు. ఇప్పుడు రామ్ చరణ్ పై ఉన్న తనకు ఉన్న అభిమానాన్ని ఇలాగే చెప్పాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. ప్రస్తుతం షారుఖ్ నటించిన తాజా సినిమా పఠాన్. ఈ చిత్రం విడుదలకు సిద్దంగా ఉండటంతో ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించాడు బాలీవుడ్ బాద్ షా. ఈ సందర్భంగా రామ్ చరణ్ గురించి ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు క్రేజీగా ఆన్సర్ ఇచ్చాడు కింగ్ షారుఖ్.
గత కొన్ని రోజులుగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ చిత్రం విమర్శలకు గురవుతోంది. ఈ చిత్రంలోని ఓ పాటలో దీపికా పదుకొనే వేసుకున్న డ్రెస్సుపై పెద్ద ఎత్తున విమర్శలు, ట్రోల్స్ వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇక పఠాన్ సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న కొద్ది మేకర్స్ ప్రచార కార్యక్రామాల్లో దూకుడు పెంచారు. అందులో భాగంగానే షారుఖ్ ఖాన్ తాజాగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేశాడు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు ఇస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే ఓ అభిమాని ఒక్క ముక్కలో హీరో రామ్ చరణ్ గురించి చెప్పండి అని అడిగాడు. దానికి షారుఖ్ స్పందిస్తూ..”రామ్ చరణ్ నాకు ఓల్డ్ ఫ్రెండ్. అదీకాక మా పిల్లలు అంటే చరణ్ కు ఎంతో ఇష్టం” అంటూ చెప్పుకొచ్చాడు బాద్ షా.
He is an old friend and very loving to my kids https://t.co/LlLU9lHM0T
— Shah Rukh Khan (@iamsrk) December 17, 2022
ప్రస్తుతం షారుఖ్ చేసిన ఈ ట్విట్ వైరల్ గా మారింది. అలాగే తెలుగు సినీ ప్రేక్షకుల అభిమానానికి తాను ఫిదా అయినట్లు, తెలుగు వారు సినిమానలు ఎక్కువగా ఇష్టపడతారని అన్నాడు. ప్రస్తుతం షారుఖ్.. డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటోంది. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే.. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC15 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్న విషయం మనందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం కూడా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, సునీల్ కీలక పాత్రాలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.