‘తిమ్మరుసు’గా సస్పెన్స్ థ్రిల్లర్‌తో వచ్చి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సత్యదేవ్ తన తర్వాత సినిమా ప్రారంభించేశాడు. ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై సత్యదేవ్ 25వ సినిమా రాబోతోంది. ఈ సినిమాకు గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇవాళ హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. దిల్‌రాజ్ క్లాప్ కొట్టగా డైరెక్టర్ హరీశ్ శంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేశాడు.
“అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై నా తర్వాతి సినిమా వస్తోంది. కృష్ణ నిర్మాతగా, డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో నా 25వ సినిమా వస్తోంది. గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఎప్పటిలాగే మీ అభిమానం, సపోర్ట్ కావాలి” అంటూ సత్యదేవ్ ట్వీట్ చేశాడు.
All about the muhurtham of my next film with #arunachalacreations produced by Krishna Garu and presented by #koratalasiva garu. Directed by #gopalkrishna
As always need your love and support. pic.twitter.com/sKoltsNkGl— Satya Dev (@ActorSatyaDev) August 18, 2021