దిల్ రాజు సినిమాలకు ఎంతలా టైమ్ కేటాయిస్తారో.. ఫ్యామిలీతోనూ అంతే సంతోషంగా సమయాన్ని ఆస్వాదిస్తుంటారు. తాజాగా భార్యతో కలిసి ఆడుతూపాడుతూ కనిపించారు. ఆ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రొడ్యూసర్ దిల్ రాజు.. చాలా బిజీగా ఉండే పర్సన్. చాలామంది హీరోహీరోయిన్లకు మించిన ఫాలోయింగ్ ఈయన సొంతం. చిన్న, భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూ ఎప్పటికప్పుడు వినోదాన్ని అందించే ఈయన… ప్రెస్ మీట్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో తనదైన మార్క్ డైలాగ్స్ తో ఎంటర్ టైన్ చేస్తుంటారు. ‘వారిసు’ ఈవెంట్ లో దిల్ రాజు చెప్పిన ‘అదిదా సార్’ అనే మాట ఎంత పాపులర్ అయిందో మీకు స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ‘శాకుంతలం’తో రిలీజ్ కు రెడీగా ఉన్న ఆయన.. ఇప్పుడు మరో విషయమై వార్తల్లో నిలిచారు. అందుకు సంబంధించిన ఓ వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలుగులో ఓ నిర్మాత 50 సినిమాలు తీయడంటే ఈరోజుల్లో కష్టమే. కానీ దిల్ రాజు.. దాన్ని రియాలిటీలో చేసి చూపించారు. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ గా ఫుల్ ఫామ్ లో ఉన్న ఈయన.. రీసెంట్ గా ‘బలగం’తో సూపర్ హిట్ కొట్టారు. ఈ మూవీకి దిల్ రాజు కూతురు హన్సిత నిర్మాతగా వ్యవహరించారు. ఇలా తనతో పాటు కూతురు కెరీర్ కూడా గాడిలో పెట్టే పనిలో పడ్డారు. మరోవైపు లాక్ డౌన్ టైంలో రెండో పెళ్లి చేసుకున్న ఈయన.. రీసెంట్ గా తండ్రి కూడా అయ్యారు. భార్య వైఘారెడ్డికి కొన్నాళ్ల ముందు బాబు పుట్టాడు. ఇప్పుడు ఆ పిల్లాడితో కలిసి దిల్ రాజు ఆడుతూ పాడుతూ కనిపించారు.
రీసెంట్ గా శ్రీరామనవమి వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్న దిల్ రాజు.. కొడుకుని ఒడిలో కూర్చో బెట్టుకుని మరీ పూజలో చేశారు. ఆ తర్వాత రాముడి పాటలు పాడటంతో పాటు, భార్యతో కలిసి డ్యాన్స్ కూడా చేశారు. తాజాగా ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఎంత సినిమాలతో బిజీగా ఉన్నాసరే ఫ్యామిలీకి దిల్ రాజు టైమ్ కేటాయిస్తున్నారని ఇది చూస్తే అర్థమవుతోంది. మనవడు, కొడుకుతో టైమ్ స్పెండ్ చేస్తూ.. అటు కెరీర్, ఇటు ఫ్యామిలీ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ దిల్ రాజు వస్తున్నారు. మరి దిల్ రాజు డ్యాన్స్ చేస్తూ, పాట పాడుతూ హ్యాపీగా ఉన్న వీడియో చూసిన తర్వాత మీకేం అనిపించింది. కింద కామెంట్ చేయండి.