సూపర్ స్టార్ రజనీకాంత్ మరో క్రేజీ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. నిర్మాత దిల్ రాజు ఈ కాంబోని సెట్ చేసినట్లు తెలుతోంది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఏం జరుగుతోంది?
ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. హీరోలు, దర్శకులు, నిర్మాతలు, నటీనటులు.. ఇలా అందరూ కూడా భాషతో సంబంధం లేకుండా పనిచేస్తున్నారు. అందుకు తగ్గట్లే క్రేజీ కాంబోలు కూడా సెట్ అవుతున్నాయి. గత రెండు మూడేళ్ల నుంచి మొదలైన ఈ ట్రెండ్.. ఇప్పుడు పీక్ స్టేజీకి వెళ్లిపోయింది. ‘ఆర్ఆర్ఆర్’కు ఆస్కార్ రావడంతో తెలుగు సినిమా, వరల్డ్ వైడ్ పాపులారిటీ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో అద్భుతమైన సినిమా సెట్ అయినట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ ని తెలుగు ఆడియెన్స్ కి మరింత దగ్గరగా చేసేందుకు దిల్ రాజు పెద్ద ప్లాన్ వేశారనిపిస్తోంది.
ఇక విషయానికొస్తే.. రజనీకాంత్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పేదేం లేదు. పేరుకే తమిళ హీరో గానీ ఆయన చేసి ప్రతి మూవీ తెలుగు డబ్ అవుతూనే ఉంటుంది. జనాలు ఆదరిస్తూనే ఉన్నారు. అయితే ‘రోబో’, ‘శివాజీ’ తర్వాత ఆ స్థాయిలో రజనీ సినిమా ఏదీ కూడా మనల్ని ఎంటర్ టైన్ చేయలేకపోతున్నాయి. దీంతో తలైవా ఫ్యాన్స్ సరైన సినిమా కోసం చాలాకాలంగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి స్టోరీని సెట్ చేసే పనిలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఉన్నట్లు తెలుస్తోంది. తళపతి విజయ్ తో ‘వారిసు’ తీసిన ఈయన.. ఇప్పుడు తమిళంలో రెండో ప్రాజెక్ట్ కే రజనీతో వర్క్ చేయబోతున్నట్లు సమాచారం.
‘జైలర్’ మూవీతో బిజీగా ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్.. దీని తర్వాత కూతురు ఐశ్వర్య తీస్తున్న ‘లాల్ సలామ్’ షూటింగ్ లో పాల్గొంటారు. అనంతరం ‘జై భీమ్’ డైరెక్టర్ తీసే మూవీలో నటిస్తారు. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాతే రజనీకాంత్-దిల్ రాజు ప్రాజెక్ట్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ కోసం ‘వాల్తేరు వీరయ్య’తో మెగాహిట్ కొట్టిన డైరెక్టర్ బాబీ పేరు వినిపిస్తోంది. మరి ఇందులో ఎంత నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ‘శాకుంతలం’ని రిలీజ్ కు రెడీ చేసిన దిల్ రాజు.. వరసగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు సెట్ చేస్తున్నారు. సరే ఇదంతా పక్కనబెడితే.. దిల్ రాజు-రజనీకాంత్ కాంబోపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.