సమంత-నాగచైతన్య విడాకుల అంశం ఇప్పుడు దక్షిణాది వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. మేము విడాకులు తీసుకుంటున్నామని చైతు-సామ్ బాహాటంగానే చెప్పుకొచ్చారు. దీంతో వీరి అంశంపై ఇటు నాగార్జున నుంచి అటు సమంత తండ్రితో పాటు టాలీవుడ్ లోని సినీ ఆర్టిస్టులు కొందరు స్పందించారు. ఇక విక్టరీ వెంకటేష్ సైతం రంగంలోకి దిగి వీరిద్దరి నిర్ణయాలతో ఏకభవించినా.. కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుండేదనే రీతిలో పోస్ట్ పెట్టాడు. అయితే ఈ క్రమంలోనే సమంత-చైతు విడాకుల నిర్ణయంలో ముమ్మాటికి సమంతదే తప్పని కొందరు భావిస్తుంటే.. కాదు కాదు చైతుదే తప్పని మరికొందరు చెబుతున్నారు.
ఇక ఇదే కాకుండా సమంత-ప్రీతమ్ జుకల్కర్ మధ్య ఏదో రిలేషన్ నడుస్తోందని టాలీవుడ్ అంతా కోడై కూస్తున్న క్రమంలో ప్రతీమ్ జుకల్కర్ మాత్రం నేను సమంతని అక్కలాగా భావిస్తానని తెలిపాడు. ఇదే సమయంలో ప్రతీమ్ జుకల్కర్ సమంతతో ఎలా ఉంటాడనే దానిపై కాస్త వివరణ ఇచ్చింది సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్. ప్రతీమ్ సమంతని అక్కలా భావిస్తాడని, వీరిద్దరి మధ్య మీరనుకునే ఎలాంటి రిలేషన్ లేదని తెలపింది. ఇక ఈ తరుణంలోనే రోజుకొక పోస్టు పెడుతున్న సమంత మరోసారి ఎమోషన్ అయి మరో పోస్ట్ పెట్టింది.
ఎప్పుడూ ఆడవాళ్లనే ప్రశ్నించే ఈ సమాజంలో మగవాళ్లను మాత్రం ఎందుకు ప్రశ్నించరు. అలాంటప్పుడు ఈ సమాజంలో ప్రాథమికంగా నైతికత లేనట్లే కదా’ అనే అర్ధమొచ్చేలా భావోధ్వేగంతో కూడిన పోస్ట్ పెట్టింది సమంత. దీంతో ఇదే పోస్ట్ తన ఇన్ స్టా వేదికగా షేర్ చేసిన ఫ్యాషన్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ ముమ్మాటికి ఇదే నిజం అంటూ పోస్ట్ పెట్టాడు. ఇక ఇద్దరూ ఒకేసారి ఒకే పోస్ట్ పెట్టడంతో ఇద్దరు కలిసే ఉన్నారా అనే ఆలోచనలు వ్యక్తమవుతున్నాయి.
ఏదేమైన సమంతపై నాకు అక్కా అనే రిలేషన్ మాత్రమే ఉందని, ఇక ఎవరెన్ని ఆరోపణలు సృష్టించిన తమేంటో మాకు తెలుసనే ఆలోచనలో ప్రీతమ్ జుకల్కర్ ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా వీరు చేసిన పోస్ట్ కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఇక తాాజాగా పెట్టిన వీరిద్దరి పోస్ట్ పై మీరు ఏకీభవిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.