నేచురల్ బ్యూటీ సాయిపల్లవి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి సినిమా అయినా తన నటనతో మెప్పించే ఈ భామకు సంబంధించి ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయ్యే న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతోంది. విషయం ఏంటంటే.. సాయిపల్లవి ఓ స్టార్ హీరోని పెళ్లి చేసుకుంది. ఎవరికీ తెలియకుండా జరిగిన ఆ పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరి ఇంతకీ ఈ బ్యూటీని పెళ్లి చేసుకున్న స్టార్ ఎవరంటే.. మన నేచురల్ స్టార్ నాని. ఆశ్చర్యపోకండి.. ఈ ఇద్దరి నేచురల్ స్టార్స్ పెళ్లి రియల్ గా కాదు, రీల్ లోనే జరిగింది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ తాజాగా ఓ ఫోటో రిలీజ్ చేసారు. అందులో నాని – సాయిపల్లవి పెళ్లి చేసుకున్నట్లుగా కనిపిస్తుంది.
ప్రస్తుతం ఈ హీరో హీరోయిన్ల పెళ్లి ఫోటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ మూవీ.. డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందు రాబోతుంది. బోయినపల్లి వెంకట్ నిర్మించిన ఈ సినిమాలో.. కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మరి సాయిపల్లవి – నానిల పెళ్లి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.