హీరోయిన్ అంటే ఎండకు కందకుండా.. నిత్యం ఏసీలో ఉంటూ.. గ్లామర్‌ని కాపుడుకుంటూ ఉంటారు. సాధారణంగా జరిగేది ఇదే. కానీ సినిమా ఒప్పుకున్న తర్వాత.. తాము పోషించబోయే పాత్ర కోసం ఎలాంటి కష్టాన్ని అయినా భరిస్తారు.. ఏం చేయడానికి అయినా సిద్ధపడతారు. కానీ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఇందుకు భిన్నం. ఈ బ్యూటీ తన మనసుకు నచ్చినట్లు ఉంటారు. హీరోయిన్ అనే ఫీలింగ్ ఏ మాత్రం లేకుండా.. సామాన్య ప్రజలతో చాలా త్వరగా కలిసి పోతారు. ఈ నాచురల్ బ్యూటీ ఇప్పటికే లేడీ పవన్ కల్యాణ్ అనే బిరుదును సంపాదించుకుంది. బయట ఎలా ఉంటుందో.. సినిమాల్లో కూడా అలానే కనిపించేందుకు ఇష్టపడుతుంది సాయి పల్లవి. ప్రతి సినిమా చేయకుండా.. తన పాత్రకు మంచి స్కోప్ ఉంది అంటేనే సినిమాలు అంగీకరిస్తుంది. ప్రేమమ్‌తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చి.. భానుమతి సింగిల్ పీస్ అంటూ తెలుగువారిని ఫిదా చేసిన సాయి పల్లవి.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: వైరల్ వీడియో: సాయిపల్లవిపై స్టార్ డైరెక్టర్ ప్రశంసలు!
ఈ క్రమంలో ఉగాది పండుగ రోజు సాయి పల్లవి అరుదైన ఫోటోను షేర్ చేసి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. పండుగ రోజు ఆమె రైతుగా మారి.. వ్యవసాయ పనులు చేశారు. మిగతా కూలీలతో కలిసి పంట కోత పనుల్లో నిమగ్నమయ్యారు. పసుపు పంట కోశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ప్రసుతం అవి వైరల్‌గా మారాయి. వీటిని చూసిన పలువురు సినీ తారలు ఆమె సింప్లిసిటీని మెచ్చుకుంటున్నారు. ‘‘సాయి పల్లవి.. నీలా ఎవరు ఉండలేరు’’ అంటూ శ్రద్ధా శ్రీనాథ్ ఆమెను ప్రశంసించారు. ఇక అభిమానుల ప్రశంసలకైతే హద్దే లేదు. సాయి పల్లవి నిజంగా నువ్వు సింగిల్ పీసే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.ఇది కూడా చదవండి: సాయిపల్లవి పై బాడీ షేమింగ్.. మండిపడిన గవర్నర్ తమిళ సై!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.