లవర్స్ డే, ఫ్రెండ్ షిప్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే.. ఇలా ప్రతి ఒక్కరికోసం ఏదో ఓరోజు ఉంది. మరి రెగ్యులర్ గా సినిమాలు చూసేవాళ్ల కోసం ఉందా అంటే కచ్చితంగా ఉంది. ప్రతి సంవత్సరం సెప్టెంబరు 16వ తేదీని ‘నేషనల్ సినిమా డే’గా జరుపుకొంటున్నారు. గత రెండేళ్లు కరోనా కారణంగా పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు గానీ ఈసారి మాత్రం గట్టిగా ప్లాన్ చేశారు. మూవీ లవర్స్ కోసం అదిరిపోయే బంపర్ ఆఫర్ ప్రకటించారు కూడా.
ఇక వివరాల్లోకి వెళ్తే.. 2020 మార్చిలో కరోనా వచ్చిన తర్వాత మన జీవితాలు చాలా మారిపోయాయి. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిపోయింది. అదేంటి అంతకు ముందు లేదా ఏంటి అని మీరు అనుకోవచ్చు.. అప్పుడు కూడా ఉంది. కానీ కరోనా వచ్చిన తర్వాత ఇంకాస్త శ్రద్ధ పెరిగింది. దీంతో చాలా రంగాలు ఎఫెక్ట్ అయ్యాయి. అలా ప్రభావితమైన వాటిలో సినిమా ఇండస్ట్రీ ఒకటి. థియేటర్స్ మూసివేయడం, చాలా సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీల్లో రిలీజ్ చేయడంతో.. పరిశ్రమకు నష్టాలు కూడా వచ్చాయి.
ఇక మూడు వేవ్ ల దెబ్బకు బాగా ఇబ్బంది పడిన టాలీవుడ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. సినిమాలు చూసేందుకు గతంతో పోలిస్తే ఆడియెన్స్ కౌంట్, థియేటర్స్ కి పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆ నంబర్స్ ని మరింత పెంచేందుకు మల్టీఫ్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం నేషనల్ సినిమా డే అయినా సెప్టెంబరు 16న మీరు దేశంలో ఏ థియేటర్ లో అయినా సరే రూ.75కే సినిమా చూడొచ్చు. దాదాపు 4000 వేల స్క్రీన్స్ లో దీన్ని సెలబ్రేట్ చేసుకోనున్నారు. పీవీఆర్, ఐనాక్స్, మిరాజ్, ఆసియన్ లాంటి మల్టీఫ్లెక్స్ లో కూడా మీరు తక్కువ మొత్తానికి సినిమా చూడొచ్చనమాట. మరి మీలో ఎంతమంది ఆ రోజు మూవీకి వెళ్లాలనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇది కూడా చదవండి: మరోసారి మాస్ స్టెప్స్ తో అదరగొట్టిన గాజువాక లేడీ కండక్టర్!
National Cinema Day – ₹75:
Multiplex Association of India (MAI) and cinemas across the country have decided to celebrate a ‘National Cinema Day’ in India on September 16th and offer tickets for ₹75. All Major Chains including Asian are among those that will be a part of this. pic.twitter.com/jBdm5Upcju
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) September 2, 2022